ETV Bharat / state

యువతి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం - అనంతపురం జిల్లాలో యువతి హత్య వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో యువతి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాజేశ్​ను ఘటనా స్థలికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.

young lady murder
young lady murder
author img

By

Published : Dec 24, 2020, 1:18 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్‌ సహా అతని స్నేహితుడు కార్తీక్‌ను ధర్మవరం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేశ్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని వివిధ పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే బాధిత తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకోని పోలీసులపై చర్యల తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.