కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమని చూపిస్తున్నాయని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అనంతపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికులను దోపిడి చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కూలీలు లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించకుండా యధావిధిగా కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి :