ETV Bharat / state

కుంగుబాటు.. ఆరోగ్యానికి చేటు!

మనోవేదనకు మందే లేదు. ఈ రుగ్మత కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న వారెందరో. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఈ వ్యాధి అధికం అవుతోంది. అయిన వారితో, మిత్రులతో మాట్లాడాలన్నా వైరస్​ సోకుతుందనే భయం ఎక్కువగా ఉంది. ఈ రుగ్మతలు దీర్ఘకాలిక జబ్బులుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ధైర్యంతోనే ఈ మహమ్మరిని ఎదుర్కోగలమని సూచిస్తున్నారు.

corona effect
కరోనా ఆందోళన
author img

By

Published : Oct 10, 2020, 5:32 PM IST

భయం.. ఆందోళన.. ఒత్తిడి.. కుంగుబాటు.. ఇవన్నీ మానసిక రుగ్మతలకు మూలం. వీటి బారిన పడుతున్న వారి ఆరోగ్యం చిన్నాభిన్నం అవుతోంది. ఇప్పటిదాకా సాధారణ సమస్యలుగా భావిస్తూ వచ్చారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా మానసిక రుగ్మతలు దీర్ఘకాలిక జబ్బులుగా మారే ప్రమాదం తలెత్తింది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో కలిసి తిరిగినా వైరస్‌ వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది.

percentage
వయస్సుల వారి నిష్పత్తి

ఈ తరహా బాధితుల సంఖ్య అమాంతం పెరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) తాజా సర్వే ప్రకారం జిల్లాలో 13.9 శాతం మంది ‘కరోనా’ మానసిక రుగ్మతలతో సతమతం అవుతున్నట్లు తేలింది. ప్రాంతాల వారీగా చూస్తే.. గ్రామాల్లో 9.57, పట్టణాల్లో 14.7 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధరణ అయింది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘దయ.. జీవితంలో ఒక భాగం కావాలి’ అన్న నినాదాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ దయార్థ హృదయాన్ని కలిగి ఉండాలన్నదే దాని సారాంశం. అసూయ, ద్వేషం, పగ ప్రతీకారం వీడి.. ప్రేమ, దయతో ఉండాలని పిలుపునిచ్చింది.

●అనంత నగరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఆగస్టు 4న తీవ్ర జ్వరం వచ్చింది. స్వల్పంగా దగ్గు, జలుబు కూడా ఉన్నాయి. ‘కరోనా’ లక్షణాలు ఉన్నాయన్న భయం ఆవరించింది. వైద్యులు పరీక్షించి సాధారణ జ్వరమేనని తేల్చారు. అయినా భయం, ఆందోళన ఆయన్ను వీడలేదు. తుదకు బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అదే నెల 11న శ్వాస విడిచాడు. కుంగుబాటు.. ఆందోళనే ప్రాణం తీశాయి.

●తాడిపత్రి పట్టణానికి చెందిన 43 ఏళ్ల వ్యక్తి కుంగుబాటుకు గురయ్యాడు. తన పక్కింటి వ్యక్తికి కరోనా సోకింది. అంతకుముందు ఆ వ్యక్తితో కలిసి తిరిగాడు. తనకు కూడా కరోనా సోకి ఉంటుందని మానసిక ఆందోళనకు గురి కావడంతో రెండుసార్లు పరీక్ష చేయించుకున్నాడు. ఫలితం నెగెటివ్‌ వచ్చింది. అయినా భయం వీడలేదు. సర్వజనాస్పత్రిలోని మానసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ తీసుకున్నాడు. ప్రత్యేక చికిత్స ద్వారా సాధారణ వ్యక్తిగా మారాడు.

26.06 శాతం మందికి కష్టం

జిల్లాలో ఇప్పటికే 60 వేల మందికిపైగా కరోనా సోకింది. వీరిలో 26.06 శాతం మందిలో మానసిక రుగ్మతలు తలెత్తాయి. 30-49 ఏళ్ల మధ్యలో వారే ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లు ఎన్‌హెచ్‌ఎం సర్వే తేల్చింది. కరోనా పాజిటివ్‌ నుంచి గట్టెక్కినా.. చికిత్స సమయంలో స్టిరాయిడ్స్‌ వంటి హానికర ఔషధాలను వాడటం వల్లే ఆందోళన, భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇవే మానసిక రుగ్మతలుగా రూపాంతరం చెందాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి అవగాహన కౌన్సెలింగ్‌ చాలా కీలకం.

కరోనాను ఎదుర్కొందాం

●ధైర్యంతో కరోనాను ఎదుర్కోవాలి.

●డబ్బు శాశ్వతం కాదు.. మనిషి మనస్తత్వం మారాలి.

●శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.

●ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు దరిచేరకుండా ప్రత్యామ్నాయ ఆలోచన ఉండాలి.

●కుటుంబ సభ్యులు, బంధువులతో కలివిడిగా ఉండాలి. ఒంటరిగా ఉండకూడదు.

●ఏదైనా మానసిక సమస్య తలెత్తితే తక్షణమే కౌన్సెలింగ్‌ తీసుకోవాలి.

●ఎలాంటి దశలోనూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

సమస్యలను గెలవాలి

ధైర్యమే ఊపిరిగా బతకాలి. సమస్యలు మనుషులకే వస్తాయి. వాటిని ఎదురించి గెలవాలి. ఒత్తిడి, నిద్రలేమి, ఆరాటం మానసిక జబ్బులకు మూలం. ప్రతి మనిషిని ప్రేమించే హృదయం ఉండాలి. సమాజం వేగంగా పరిగెడుతోంది. అందరికంటే నేనే ముందుండాలన్న భావన సరికాదు. కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు.. ఇలా అందరితోనూ మంచిగా ఉండాలి. కలిసిమెలసి జీవించాలి. అప్పుడే ఆందోళన, ఒత్తిడి దరిచేరవు. ఏ సమస్య వచ్చినా చర్చించుకుని పరిష్కరించుకుంటే మనసు తేలిక అవుతుంది. - ఆచార్య ఎండ్లూరి ప్రభాకర్‌, మానసిక వైద్యశాస్త్ర విభాగం అధిపతి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల

ఇదీ చదవండి:

కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.