అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో డిగ్రీ కళాశాలకు ఈ ఏడాది మే, నెలలో విద్యార్థులకు ఉపకార వేతనాలు ట్యూషన్ రుసం మొత్తం 25 లక్షలు మంజూరు అయ్యాయి. ఉపకార వేతనాలను విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ట్యూషన్ రుసుములను ప్రభుత్వ బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణం ఆ ప్రక్రియ ఆలస్యం అయింది. దీనిని ఆ కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అదునుగా తీసుకుని ఆ మొత్తాలను సంబంధిత ఖాతాలకు జమ చేస్తానని కళాశాల అధికారులను నమ్మించాడు. చలానాల ద్వారా 25లక్షలను పట్టణంలోని బ్యాంకు శాఖ నుంచి అనంతపురం జె.ఎన్.టి.యు సమీపంలో ఉన్న మరో బ్యాంకులోని తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు సదరు బ్యాంకులో విచారించారు. సదరు ఉద్యోగి 25 లక్షలు తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు స్పష్టమయింది.
నకిలీ చలానాలతో బురిడీ..
ఆ ఉద్యోగి 25 లక్షలు తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించుకునట్లు కళాశాల అధికారులకు అనుమానం రాకుండా ప్రధాన బ్యాంకుకు సంబంధించిన నకిలీ చలనాల సృష్టించాడు. బ్యాంకుకు సంబంధించి సిళ్ళు నకిలీవి తయారుచేయించి వాటితో నకిలీ విత్తనాలపై ముద్రవేసి బ్యాంకు అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. గతంలో బ్యాంకులో పనిచేసిన అధికారి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలిసింది ఈ నకిలీ చలానాల కారణంగా అధికారులు స్వాహా బాగోతాన్ని గుర్తించడం ఆలస్యమైంది.
నేడు విచారణకు త్రిసభ్య కమిటీ రాక..
ఉద్యోగి 25 లక్షలు స్వాహా చేసిన ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఉద్యోగికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అతను సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. తాను తప్పు చేశానని నెల రోజులు సమయం ఇస్తే ఆ మొత్తాన్ని తిరిగి కడతానని అధికారులను కోరినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేయడానికి శనివారం త్రిసభ్య కమిటీ కళాశాలకు రానున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: రూ.12 కోట్లకు టోకరా వేసిన నూతన్ నాయుడు?