అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో 17 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. దీనిపై గాండ్లపెంట పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మూడు రోజుల కిందట కదిరి పట్టణంలో ఆ బాలిక అపహరణకు గురైంది. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు.. నిందితున్ని వెంబడించి బాలికను రక్షించారు. ఆ మరుసటిరోజే గాండ్లపెంట మండలంలోని బాలిక కనిపించకుండాపోవడం ఆ కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదీ చదవండి..