ETV Bharat / state

People Suffering Due to Lack of Bridge in Pedderu: పెద్దేరుపై వంతెన గుర్తుందా ధర్మశ్రీ.. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 3:11 PM IST

Updated : Oct 12, 2023, 4:52 PM IST

People Suffering Due to Lack of Bridge in Pedderu: ఆ ఏరు దాటలేక ప్రజలకు తరతరాలుగా కన్నీరు మిగులుతోంది. పాలకులు ఎన్ని బటన్లు నొక్కితే ఏం లాభం.. ఆ ప్రాంత ప్రజల చిరకాల కలను మాత్రం తీర్చలేకపోతున్నారు. సొంత జిల్లాలో నెలకొన్న సమస్యపై ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఏమైనా జోక్యం చేసుకుంటారా అంటే అదీ లేదు. వంతెన కట్టించే పూచీ నాదన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

People_Suffering_Due_to_Lack_of_Bridge_in_Pedderu
People_Suffering_Due_to_Lack_of_Bridge_in_Pedderu
People Suffering Due to Lack of Bridge in Pedderu: పెద్దేరుపై వంతెన గుర్తుందా ధర్మశ్రీ.. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

People Suffering Due to Lack of Bridge in Pedderu: ఏరు దాటాలంటే ప్రాణాలతో చెలగాటమాడాల్సిందే. ఇదీ అనకాపల్లి జిల్లా చాకిరేవు, రామజోగిపాలెం, జన్నవరం గ్రామాల సమీపంలోని పెద్దేరు వద్ద నెలకొన్న పరిస్థితి. వర్షాలు పడి వరదలు వస్తే ఇక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. ప్రమాదకర రీతిలో ప్రవహించే పెద్దేరు దాటితేనే కానీ స్థానిక గ్రామాల ప్రజల అవసరాలు తీరవు. పీకల్లోతు నీటిలో ఆధారాన్ని పట్టుకొని ప్రయాణిస్తూ కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

Vizag Did Not Develop During YCP Government: విశాఖపై ఎనలేని ప్రేమ చూపిస్తోన్న సర్కార్.. తెరపైకి మెట్రో కథ.. ఇన్నాళ్లూ ఏం చేశారో..!

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు (Panchayat Raj Minister Budi Mutyala Naidu) సొంత జిల్లాలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చోడవరం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చాకిరేవు,రామజోగిపాలెం, జన్నవరం పరిసర గ్రామ ప్రజలు పెద్దేరుపై సరైన వంతెన లేక అవస్థలు పడుతున్నారు, ఈ యేరు నడవడానికి వంతెన లేక కేవలం రెండు తాళ్లు చేత్తో పట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ పెద్దేరు దాటే సమయంలో చాల మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నా.. వైసీపీ ప్రభుత్వం కనీసం ఇక్కడ బ్రిడ్జి నిర్మించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YCP Govt Doesnot Care about Tourist Places: 'పర్యాటకం'పై వైసీపీ ప్రభుత్వం గొప్పలు.. కనీస సౌకర్యాల్లేక సందర్శకుల తిప్పలు

YCP MLA Karanam Dharamshri Promise on Pedderu Bridge: వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (MLA Karanam Dharmashree) ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే పెద్దేరుపై వంతెన నిర్మాణం చేస్తానని మాట ఇచ్చారు. కరణం ధర్మశ్రీ ఎన్నికలో గెలిచారు. కానీ మాట తప్పారు ఎన్నికల సమయం తరవాత ఒక్క అధికారి కానీ ఒక్క ప్రజా ప్రతినిధి కానీ తమ గ్రామం వైపు చూడలేదని బాధిత గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రవాణా సౌకర్యం లేని చాకిరేవు, రామ జోగిపాలెం, జన్నవరం ప్రాంతాలను చోడవరం జనసేన ఇంఛార్జి పీవీఎస్ఎన్ రాజు సందర్శించారు. ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయారు.

YCP Leaders Focus on Visakha Lands: 'రియల్‌' రంగంపై ప్రభావం చూపని రాజధాని ప్రకటనలు.. విశాఖలో మందగించిన భూకొనుగోళ్లు

Janasena Incharge PVSN Raju Visited Pedderu Bridge: రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్​ ఇద్దరూ ఈ జిల్లాలో ఉండి కూడా ప్రజా గోడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడి వరదలు వస్తే ప్రమాదకర రీతిలో పెద్దేరు దాటుతూ సమీప గ్రామస్థులు ప్రాణాలు కోల్పుతున్నా వైసీపీ ప్రభుత్వంలో కనిసం పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకుంటే జనసేన-తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినా వెంటనే వంతెన నిర్మాణం చేపడతామన్నారు. హామీలు అమలు చేసేశామని చెప్పే వైసీపీ నేతలు వంతెన నిర్మాణం గురించి ఎందుకు పట్టించుకోరని విపక్షాలు నిలదీస్తున్నాయి.

Last Updated : Oct 12, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.