Large Size Of King Cobra: 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను చూసిన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాశీపురం శివారు లక్ష్మిపేటలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భారీగా ఉన్న ఈ తాచుపామును చూసిన జనం భయపడిపోయారు. ఓ మరుగుదొడ్డిలో కింగ్ కోబ్రా కనిపించడంతో..గ్రామంలో ఒక్కసారిగా కలవరం చోటు చేసుకుంది. బుసలు కొడుతు కదులుతున్న ఈ పామును చూసి, ప్రజలు హడలిపోయి.. వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు దాన్ని పట్టుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరకు సురక్షితంగా సంచిలో బంధించి వంట్ల మామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉపిరిపిల్చుకున్నారు.
ఇవీ చదవండి: