DOLI: పాడేరు ఏజెన్సీలో డోలీ మోతలు ఆగడం లేదు. పురిటి నొప్పులు వస్తే ఆస్పత్రికి తరలించే యాతన తప్పడం లేదు. గిరిజన గర్భిణిల కోసం వసతి ఏర్పాటు చేసినా.. ముందస్తుగా తరలించే సౌకర్యం లేదు. ఫలితంగా.. పురిటి నొప్పులతో డోలీ మోతలు మోసి ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జన్నేరుగొండిలో ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది. కొండమట్టి రహదారి వరకూ.. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ గర్భిణిని మోసుకొచ్చి ద్విచక్రవాహనంపై జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: టిడ్కో గృహాలపై గూడుకట్టిన నిర్లక్ష్యం.. సర్కార్‌పై లబ్ధిదారుల విమర్శలు