Strange baby born: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మాతా శిశు ఆసుపత్రిలో మరో వింత శిశువు జన్మించింది. మూడు నెలల క్రితం చెవులు లేని శిశువు జన్మించగా.. మూడు రోజుల క్రితం శరీర అంతర్భాగాలు బయటికి వచ్చిన శిశువు జన్మించింది. తాజాగా.. ఇవాళ ఓ శిశువు ఆడ-మగ అన్నది తేల్చలేని పరిస్థితుల్లో జన్మించింది. జననేంద్రియాలు నిర్ధారించలేకుండా పుట్టింది. మూత్ర ద్వారం కూడా మూసుకుపోయింది. ఇలాంటి శిశువులకు వివిధ టెస్టులు చేసి జెండర్ నిర్ధారించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ట్రాన్స్ జెండర్ విషయంలో యుక్త వయసులోకి అడుగు పెట్టగానే మగ వారికి, ఆడవారికి లక్షణాలు తెలుస్తాయని చెప్పారు. కానీ.. ఈ బిడ్డ విషయంలో పరీక్షలు చేస్తేగానీ నిర్ధారించలేమని వైద్యురాలు తెలిపారు.
ఇవీ చదవండి: