భూమి లేదన్నా వినటం లేదు.. వృద్ధాప్య పింఛను ఇప్పించాలంటూ వృద్ధురాలి ఆవేదన - వృద్ధాప్య పింఛను ఇప్పించాలంటూ వృద్ధురాలి ఆవేదన
Old woman pension: కనిపెంచిన కుమారులు.. వృద్ధాప్య వయసులో ఆ తల్లిని వదిలేశారు. కనీసం ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనైనా కాలం వెళ్లదీద్దామనుకుంటే.. అధికారులు దానినీ తొలగించారు. ఇక చేసేది.. లేక ఏడు పదుల ఏళ్ల వయసులో.. కూలి పనులు చేసుకుంటూ అర్ధాకలితో జీవిస్తుంది ఆ వృద్ధురాలు.
![భూమి లేదన్నా వినటం లేదు.. వృద్ధాప్య పింఛను ఇప్పించాలంటూ వృద్ధురాలి ఆవేదన old woman agony to given old age pension in alluri seetharamaraju district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15819214-2-15819214-1657776392291.jpg?imwidth=3840)
వృద్ధాప్య పింఛను ఇప్పించాలంటూ వృద్ధురాలి ఆవేదన
వృద్ధాప్య పింఛను ఇప్పించాలంటూ వృద్ధురాలి ఆవేదన
పాడేరులోని సప్పిపుట్టి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు.. తనకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ తొలగించారని వాపోయింది. తన పేరు మీద భూమి ఉందన్న కారణంతో పింఛన్ తీసేశారని.. బోరున విలపించింది. భూమిని తన కుమారులకు ఎప్పుడో అప్పగించానని వాపోయింది. పింఛన్ తిరిగి ఇప్పించాలంటూ కన్నీరు పెట్టుకుంటూ వేడుకుంది. కూలీ పనులు చేసుకుంటున్న తనకు తిరిగి పింఛన్ ఇవ్వాలని కోరుతుంది.
పింఛన్ తొలగించడంపై.. వాటంటీర్ను ప్రశ్నించగా.. రికార్డుల్లో భూమి ఉన్నట్లు నమోదవ్వటంతో తీసేసినట్లు తెలిపారు. దీనిపై కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు వాలంటీర్ తెలిపారు.
ఇవీ చూడండి:
TAGGED:
ap latest news