ETV Bharat / state

రేపే ఎమ్మెల్సీ పోలింగ్.. అంతా సిద్ధం చేసిన యంత్రాంగం - పోలింగ్ కేంద్రాలు

MLC Elections Arrangements : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయా జిల్లాల అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో ఎనిమిది మండలాలకు గాను 17 పోలింగ్ బూత్ లలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రేపే ఎమ్మెల్సీ పోలింగ్..
రేపే ఎమ్మెల్సీ పోలింగ్..
author img

By

Published : Mar 12, 2023, 1:52 PM IST

రేపే ఎమ్మెల్సీ పోలింగ్..

MLC Elections Arrangements : అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 11 మండలాల్లో 15 పోలీస్ స్టేషన్లలో 11,525 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 500 మంది పోలింగ్ స్టాఫ్​ను వారి పోలింగ్ కేంద్రాలకు 7 ప్రత్యేక రూట్ బస్సుల ద్వారా తరలించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.. పోలింగ్ సిబ్బంది బూత్​లకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసి పంపించారు. జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ స్వయంగా మైక్​లో జాగ్రత్తలు చెబుతూ అందర్నీ బస్సుల్లో ఎక్కించారు. ముఖ్యంగా పోలింగ్ స్టాఫ్ ఫోన్లు వాడరాదని హెచ్చరించారు. ఫోన్లు స్విచ్ ఆఫ్​లో ఉంచాలని చెప్పారు. దూరమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల బస్సు రూట్​లను ముందుగా తరలించారు.

విధుల్లో బోధనేతర సిబ్బంది... ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా బోధనేతర సిబ్బందితో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. బ్యాంకులు, రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ డబ్య్లూఎస్, ఎంపీడీవోలు, ఇతర ఉపాధ్యాయులు కాని సిబ్బంది సుమారు 500 మంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రూట్ మ్యాపింగ్ వాహనాల తరలింపు తదితర ప్రక్రియను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దగ్గరుండి స్వయంగా పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ రూట్ మ్యాప్​ విషయాల్లో తగు సూచనలు ఇచ్చారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 11,525 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ కూడా పూర్తి చేశాం. ఉపాధ్యాయులు మినహా.. ఇతర ప్రభుత్వ శాఖలకు చెందని నిపుణులైన సిబ్బందిని ఎంపిక చేశాం. పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. పకడ్బందీగా పోలింగ్ పూర్తి చేసేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. - సుమిత్ కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో... ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎనిమిది మండలాలకు గాను 17 పోలింగ్ బూత్​లలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆర్డీవో రామారావు ఆధ్వర్యంలో స్థానిక స్కిట్ కళాశాల కేంద్రంగా పోలింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రిని అందజేసి సూచనలు జారీ చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అయితే ఎన్నిక దగ్గర పడుతుండంతో వైఎస్సార్సీపీ చెందిన నేతలు, వాలంటీర్లు భారీగా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. బయట ప్రాంతాలకు చెందిన యువకులు ఓటర్లను కలుస్తుండడం గమనార్హం.

ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్ బాబు ఆర్డీఓ కరుణ కుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కళాశాల ప్రాంగణంలో బహిరంగంగా ఏర్పాటు చేయకుండా గదుల్లో ఏర్పాటు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కామన్​గా గదుల్లో ఏర్పాటు చేస్తే ఎవరికి ఎన్నికల అందిందో, లేదో పోలింగ్ సిబ్బంది ఎవరు వచ్చారో, లేదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కళాశాల ప్రాంగణంలో బహిరంగంగా పోలింగ్ సిబ్బంది అందరినీ కూర్చోబెట్టి సాామగ్రి పంపిణీ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అందరికీ ఒకచోట ఎన్నికల సాామగ్రిని పంపిణీ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.