ETV Bharat / state

అభివృద్ధి లేదన్న గిరిజనులు.. చంద్రబాబుపై దాడి చేయాలన్న వైకాపా ఎమ్మెల్యే! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

GADAPA GADAPA: "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన.. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని హెచ్చరించారు.

GADAPA GADAPA
GADAPA GADAPA
author img

By

Published : Jun 25, 2022, 9:51 AM IST

GADAPA GADAPA: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీ కేంద్రంలో శుక్రవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పంచాయతీ పరిధిలోని గిరిజనులు సమస్యలు ఏకరువుపెట్టారు. తమ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని.. రహదారులు, మంచినీటి, మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు స్పందిస్తూ.. రహదారులు మంజూరు అయినప్పటికీ నిధులు లేకపోవడంతో నిలిచిపోయాయని చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి నిధులు లేవని చెప్పారు. అయినా.. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కదా అంటూ.. ఎంపీపీ, జడ్సీటీసీ ​ సభ్యులు చెప్పడంతో.. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంచాయతీని దత్తత తీసుకొని.. మూడేళ్ల పాలనలో ఏమి చేశారంటూ నిలదీశారు.

గిరిజనులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించడంతో.. "సమస్యలు చెప్పండి కానీ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు" అన్నారు ఎమ్మెల్యే. ఈ మాటలకు స్థానికులు మరింత మండిపడడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇల్లు లేదని ప్రశ్నించగా.. "ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయడం వల్ల నిలిచిపోయాయి.. కాబట్టి వారినే ప్రశ్నించండి, కొట్టండి, నరకండి" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.