Telangana Weather: తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఈ రోజు తమిళనాడు తీరం పాండిచ్చేరి, కరైకాల్, దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్‌లలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది.
గాలులు ఈశాన్య తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తాయని వెల్లడించింది. గత రెండు రోజులుగా ఉన్న చలి తీవ్రత కాస్త తగ్గిందని, నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.
ఇవీ చదవండి: