Weather Update: అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తర భారతంలోని వాతావరణ ప్రభావంతో దక్షిణాదిన చల్లటి గాలులు వీస్తున్నాయి. చలికి తోడు ఉదయం పది గంటల వరకూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో శనివారం చింతపల్లిలో ఈ సీజన్లోనే అత్యల్పంగా 4.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
లంబసింగిలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటంతో ఏజెన్సీ వాసులు చలికి వణికిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి పది గంటల వరకూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంటలు మాత్రమే ఎండ వస్తోంది. తరువాత నుంచి చలి ప్రభావం కనిపిస్తోంది. దీంతో గిరిజనులు చలిమంటలు కాసుకుంటూ, ఉన్ని దుస్తులు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఇవీ చదవండి