ETV Bharat / state

Crimes: పుట్టింటికి వెళ్తానన్నందుకు భార్య హత్య.. తాళం వేసుకుని వెళ్తే.. ఇంట్లో సొమ్ము గోవిందా.. - అనంతపురం జిల్లాలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Crimes and Accidents : పుట్టింటికి వెళ్లిపోతానన్న తన మూడో భార్యను గుట్టుచప్పుడు కాకుండా అతి కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడో భర్త. ఈ దారుణమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా విక్రయిస్తున్న విదేశీ మద్యాన్ని ఎస్​ఈబి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 22, 2023, 12:37 PM IST

Crimes and Accidents: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ వ్యక్తి పుట్టింటికి వెళ్లిపోతానన్న తన మూడో భార్యను గుట్టుచప్పుడు కాకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. జిల్లాలోని పాడేరు మండలం తియ్యనిగెడ్డ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాడేరు సీఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జి.మాడుగుల మండలం కొరాపల్లి గ్రామానికి చెందిన బోడ కొండమ్మ(20)ను తొమ్మిది నెలల క్రితం పాడేరు మండలం తియ్యనిగెడ్డ గ్రామానికి చెందిన గణపతి మూడో వివాహం చేసుకున్నాడు. అతడికి ఇంతకు ముందు రెండు పెళ్లిళ్లు జరగ్గా.. వారిలో మొదటి భార్యకు ఆరుగురు సంతానమున్నారు. రెండో భార్య గణపతి నుంచి విడిపోయింది.

ఇదిలా ఉండగా.. గణపతి తన మూడో భార్య కొండమ్మతో కలిసి ఆరు నెలల క్రితం రావులపాలెం ఇటుకల కంపెనీలో కూలి పనుల కోసం వెళ్లాడు. కాగా.. ఇటీవలే వారిద్దరూ గ్రామానికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ నుంచి పుట్టింటిలో తనను విడిచిపెట్టాలని గణపతిని కొండమ్మ బలవంతం చేస్తుండేది. ఇది అతడికి ఇష్టం లేకపోవడంతో ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారి మధ్య గొడవ పెద్దదవవటంతో ఈ నెల 17వ తేదీన ఆమె వద్ద ఉన్న చున్నీని మెడకు చుట్టి హతమార్చాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా భార్య కొండమ్మ మృతదేహాన్ని శివారు ప్రాంతంలో పాతిపెట్టాడు.

Murder Under Influence of Ganja: గంజాయి మత్తు.. కొట్టుకున్న యాచకులు.. ఒకరు మృతి

సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాన్ని పాతిపెట్టిన పైభాగంలో కట్టెలతో దహన సంస్కారాలు చేసినట్లు చూపాడు. ఇదంతా పూర్తయిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతూ కొండమ్మ మృతి చెందిందని, దహస సంస్కారాలు పూర్తి చేశామని ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న మృతురాలి తండ్రి త్రిమూర్తులు, ఇతర కుటుంబ సభ్యులు తియ్యనిగెడ్డ గ్రామానికి వెళ్లారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ సుధాకర్‌, ఎస్సైలు లక్ష్మణ్‌, రంజిత్​ దీనిపై విచారణ చేపట్టారు. గణపతే ఆమె భర్తను హతమార్చి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు గుర్తించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడితోపాటు అతడికి సహకరించిన మరో నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

విజయవాడలో అక్రమ మద్యం విక్రయాలు..
విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా విక్రయిస్తున్న విదేశీ మద్యాన్ని ఎస్​ఈబి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను బుధావారం విలేకర్ల సమావేశంలో పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నగరంలోని శ్రీనివాసనగర్‌ బ్యాంకు కాలనీ 5వ రోడ్డులో నివాసం ఉంటున్న జొన్నలగడ్డ లీలాకుమార్‌ హరియాణా రాష్ట్రం పానిపట్‌లోని ఇంగ్లిష్‌ వైన్స్‌లో గత నెల 20న తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి విజయవాడకు వాటిని తెచ్చేందుకు అతడికి లారీలు దొరకలేదు. దీంతో అక్కడే 12 రోజులు వేచి ఉన్నాడు. ఈ నెల 4న లారీపై అదనపు లోడుగా మద్యం సీసాలను పేర్చి 6వ తేదీ అర్ధరాత్రి 12గంటల సమయంలో విజయవాడలోని తన ఇంటిలో డంపింగ్‌ చేశాడు. సుమారు 750 బ్రాండ్‌లకు చెందిన మద్యాన్ని ఇంట్లోనే దాచి కొంతమందికి విక్రయించాడు. ఈ సమాచారాన్ని ఓ గుర్తుతెలియని వ్యక్తి స్థానిక ఎక్సైజ్‌ పోలీసులకు అందించాడు. దీంతో మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో ఎన్టీఆర్‌ జిల్లా సెబ్‌ అధికారి కే.వీ.రామకృష్ణ ప్రసాద్‌ ఆదేశాల మేరకు తూర్పు ఎస్‌ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ బ్రాండ్‌ల 750 మి.లీటర్ల సీసాలు 710, రెండు లీటర్ల సామర్థ్యం ఉన్న 18 సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.17లక్షలు ఉంటుంది.

ప్రకాశం జిల్లాలో ఆటో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు..
మరోవైపు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం హజీజ్​పురం గ్రామ సమీపంలో కూలీలతో వెళుతున్న ఓ ఆటో ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు దీనిని గమనించి హుటాహుటిన ఆటోలో ఉన్న కూలీలను బయటకు తీసి, 108 వాహనం ద్వారా కనిగిరి వైద్యశాలకు తరలించారు. మండలంలోని శంకవరం గ్రామానికి చెందిన కొందరు కూలీలు.. ఆటోలో ఏరువారిపల్లి గ్రామంలో కూలి పనులకు వెళ్లారు. కూలి పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా హాజీపురం గ్రామ సమీపంలోకి రాగానే కూలీలు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Accidents: సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 12మందికి గాయాలు.. మరోవైపు స్కూల్ బస్సు బోల్తా..

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. 15 తులాల వెండి, 60 వేల నగదు మాయం..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు నారాయణస్వామి ఇంటిలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడులు.. బాధితుల ఇంటి బీరువాలో ఉన్న 15 తులాల వెండి ఆభరణాలు, రూ. 60 వేల నగదును దోచుకునిపోయారు. వివరాల ప్రకారం.. నారాయణస్వామి.. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుపతికి వెళ్లారు. కాగా ఆ సమయంలో ఆయన ఇంట్లో ఉన్న బీరువాలను విరగ్గొట్టి 15 తులాల వెండి, రూ. 60 వేల నగదును దోచుకుని వెళ్లిపోయారు. బాధితులు ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో దొంగల భయం ఎక్కువ. ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారో.. దొంగలు చోరీలకు పాల్పడడం తథ్యం. ప్రజలు దాచుకున్న సొమ్ము గోవిందా.. దీంతో పట్టణ ప్రజలు దొంగల నుంచి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Robbery In Vizianagaram: విజయనగరంలో భారీ దారి దోపిడీ.. రూ.50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.