ETV Bharat / state

చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన - బస్సుల్లేక ఉద్యోగులు, ప్రయాణికుల ఇబ్బందులు

Chintapalli Locals Suffer With CM Jagan Visit: అల్లూరి జిల్లా చింత‌ప‌ల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ ప‌ర్యటిస్తుండటంతో స్థానికులకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. పోలీసులు చింత‌ప‌ల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జ‌న‌ సంచారం ఉండే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, రాక‌పోక‌లు నియంత్రిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం సభ కోసం బస్సులన్నీ తరలించడంతో చింతపల్లి, పాడేరులో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

chintapalli_locals_suffer_with_cm_visit
chintapalli_locals_suffer_with_cm_visit
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 1:25 PM IST

Updated : Dec 21, 2023, 1:34 PM IST

Chintapalli Locals Suffer With CM Jagan Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలకు గురికావాల్సిందే. ముఖ్యమంత్రి పర్యటన పేరుతో అధికారులు బస్టాండ్లలో ఉన్న బస్సులను తరలిస్తారు, షాపులు మూయించేస్తారు, బారికేడ్లు అడ్డంపెట్టి రోడ్లను బంద్ చేస్తారు, వాహనదారులకు ఆంక్షలు విధిస్తారు. అంతేకాదు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రతి చెట్టును నరికేస్తారు. సీఎం హెలీప్యాడ్ కోసం ద‌శాబ్దాల చరిత్ర కల్గిన భారీ వృక్షాలను కూకటి వేళ్లతో పీకేస్తారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.

చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన - బస్సుల్లేక ఉద్యోగులు, ప్రయాణికుల ఇబ్బందులు

Police Restrictions in Chintapally: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు గత సంవత్సరం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా ట్యాబులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రెండో విడత కింద ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం కనబరుస్తూ, చింత‌ప‌ల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. జ‌న‌సంచారం ఉండే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, రాక‌పోక‌లను నియంత్రిస్తున్నారు.

హెలికాప్టర్ లేనిదే ఇంటి నుంచి బయటికి రాని ఏపీ సీఎం - 20 కిలోమీటర్ల కోసం 200 కిలోమీటర్ల నుంచి

Paderu Passengers Fire on CM Jagan Visit: మరోవైపు సీఎం జగన్ సభ కోసం బస్టాండ్లలో ఉన్న బస్సులన్నీ తరలించడంతో చింతపల్లి, పాడేరులో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లలో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు డిపో బస్సులన్నీ సీఎం కార్యక్రమం కోసం చింతపల్లికి తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బస్సులు లేక మారుమూల ప్రాంతాలకు వెళ్లలేక పోయారు. వారపు సంతకు వెళ్లే వ్యాపారులు వాహనాల లేక అవస్థలు పడుతున్నారు.

సీఎం జగన్ పర్యటనలో మహిళల ఇక్కట్లు - 'పాల్గొనకుంటే 50రూపాయల ఫైన్'

Tribal Community Leaders Under House Arrest: అల్లూరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. చింతపల్లిలో సీపీఎం నాయకులను గృహనిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డగిస్తారనే అనుమానంతో ఏజెన్సీ ప్రాంత గిరిజన సంఘం నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్‌పై సీఎం ప్రకటన చేయాలని, జీవో నంబర్‌ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని నేతలు నిరసనకు దిగడంతో వారిని ముందుస్తుగానే నిర్బంధాలు చేశారు. చింతపల్లిలో అత్యల్పంగా 7డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇంతటి చలిలోనూ సీఎం సభకు విద్యార్థుల్ని తరలించడంతో వాళ్లంతా వణుకుతూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. సీఎం ప‌ర్యట‌న సంద‌ర్భంగా చౌడుప‌ల్లిలో హెలీప్యాడ్ కోసం ద‌శాబ్దాల వయస్సున్న భారీ వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం గమనార్హం.

పుట్టపర్తిలో సీఎం జగన్​ పర్యటన - ట్రాఫిక్​ జామ్​తో వాహనదారుల ఇబ్బందులు

Last Updated : Dec 21, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.