భారత యువరెజ్లర్ రవి కుమార్ దహియా.. టోక్యో ఒలింపిక్స్లో రజతం గెలిచి, మన మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించాడు. దీంతో హరియాణా ప్రభుత్వం అతడిపై వరాల జల్లు కురిపించింది.
ఒలింపిక్స్ పతక విజేత రవి కుమార్ దహియాకు క్లాస్-1 కేటగిరీ ఉద్యోగం, రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాట్ భూమి 50 శాతం రాయితీతో అందిస్తామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. అతడి స్వస్థలం నాహ్రీలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అలానే ముందే ప్రకటించినట్లు రజతం గెలిచినందుకు రూ.4 కోట్లు నజరానా ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం స్పష్టం చేసింది.
23 ఏళ్ల రవికుమార్ దహియాకు ఇదే తొలి ఒలింపిక్స్. 57 కిలోల విభాగంలో పోటీపడిన అతడు.. ఫైనల్లో ఆర్ఓసీ(రష్యా ఒలింపిక్ కమిటీ) ప్లేయర్ ఉగెవ్ జవుర్ చేతిలో 4-7 తేడాతో ఓడిపోయాడు.
ఇది చదవండి: Olympics: భారత్కు మరో పతకం.. రెజ్లర్ రవి దహియాకు రజతం