ETV Bharat / sports

గోల్డెన్ బాయ్​కు 'మహీంద్ర' స్పెషల్ కారు.. సీఎస్కే రూ.కోటి నజరానా

స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్​ చోప్డాకు మహీంద్ర ఎక్స్​యూవీ కొత్త ఎడిషన్ కారు అందింది. చెప్పిన మాట ప్రకారం ఆనంద్ మహీంద్ర.. కారును నీరజ్​కు అందజేశారు. నీరజ్ జావెలిన్ విసిరిన దూరం 87.58 మీటర్లు. ఈ నంబర్​ను కారుపై ప్రత్యేకంగా అమర్చారు. కాగా, సీఎస్కే ఫ్రాంచైజీ కూడా అతడిని సత్కరించి రూ.కోటి రూపాయల భారీ నజరానాను ప్రకటించింది.

neeraj chopra
నీరజ్​ చోప్డా
author img

By

Published : Oct 31, 2021, 1:47 PM IST

Updated : Oct 31, 2021, 3:59 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన స్టార్ అథ్లెట్​ నీరజ్​ చోప్డాకు మహీంద్ర ఎక్స్​యూవీ 700 కారు డెలీవరి అయింది. ఇచ్చిన మాట ప్రకారం ఆనంద్ మహీంద్ర.. జావెలిన్ ఎడిషన్​ కారును నీరజ్​కు పంపించారు. ఈ విషయాన్ని నీరజ్ ట్విట్టర్​ ద్వారా షేర్ చేస్తూ, మహీంద్ర సంస్థల ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రకు ధన్యవాదాలు చెప్పాడు.

ఈ కారు కుడి భాగంలో బంగారు వర్ణంలో 87.58 అనే నంబర్​తో పాటు జావెలిన్ వేస్తున్న చిన్న బొమ్మను ప్రత్యేకంగా అమర్చారు. 87.58 అనేది ఒలింపిక్స్​లో నీరజ్, జావెలిన్ విసిరిన దూరం. దానిని ఇప్పుడు కారుపై అమర్చడం ఆకర్షణీయంగా అనిపిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​మెడల్​ సాధించిన క్రీడాకారులకు గుర్తుగా కొత్త ఎక్స్​యూవీ 700 జావెలిన్ ఎడిషన్​ను ఆవిష్కరించారు. ప్రస్తుతం 65 వేలకు పైగా బుక్సింగ్ నమోదు కాగా, వచ్చే ఏడాది జనవరి 14కల్లా కనీసం 14 వేల కార్లను అయినా డెలివరీ చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ధర రూ.12.49-రూ.22.89 లక్షల(ఎక్స్-షో రూమ్) మధ్య ఉంది.

రూ.కోటి నజరానా
చెన్నై సూపర్​ కింగ్స్​ ఫ్రాంఛైజీ కూడా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్డాను సత్కరించింది. 2020 టోక్యో ఒలింపిక్స్​లో జావెలిన్​త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్​కు రూ.కోటి బహుమతిగా ఇచ్చింది. ఈ మెగా​ క్రీడల్లో నీరజ్.. అత్యధికంగా జావెలిన్​ను 87. 58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు. ఇందుకు గుర్తుగా.. 8758 నంబర్​తో ఉన్న చెన్నై సూపర్​ కింగ్స్​ జెర్సీని నీరజ్​కు ఇచ్చింది సీఎస్కే. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎస్కే సీఈఓ కాశి విశ్వనాథన్.. 'నీరజ్​ను చూసి దేశం గర్వించిందని' చెప్పారు. స్పెషల్​ జెర్సీని చోప్డాకు బహుమతిగా ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా, చెన్నై ఇచ్చిన బహుమానానికి ధన్యవాదాలు తెలిపాడు నీరజ్.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2021, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.