టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఓ క్రీడాకారిణికి దాని బదులు మరో మెడల్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) వెల్లడించింది.
ఇంతకీ ఏమైంది?
జపాన్ సాఫ్ట్‌బాల్ టీమ్.. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. ఆ జట్టులో సభ్యురాలు.. తన ఊరి మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఆ సమయంలో తన పతకాన్ని ఆయన మెడలో వేసింది. అయితే సదరు మేయర్ ఆ మెడల్‌ను కొరుకుతూ, ఒలింపియన్లా పోజులిచ్చారు. దీంతో నెటిజన్లు తెగ విమర్శలు చేశారు. ఫలితంగా ఆయన క్షమాపణలు చెప్పారు.
సదరు సాఫ్ట్ బాల్ ప్లేయర్ కోరిక మేరకు ఆ గోల్డ్ మెడల్ మార్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంగీకారం తెలిపింది.
జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, భారత్ ఏడు పతకాలతో 48వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఇవీ చదవండి: