ETV Bharat / sports

Olympics Live: సెమీస్​లో సింధు ఓటమి.. క్వార్టర్స్​కు మహిళల హాకీ జట్టు

author img

By

Published : Jul 31, 2021, 6:34 AM IST

Updated : Jul 31, 2021, 6:47 PM IST

TOKYO OLYMPICS
ఒలింపిక్స్​ ఇండియా టోక్యో

18:44 July 31

క్వార్టర్స్​లో భారత మహిళల హాకీ జట్టు..

ఐర్లాండ్​తో జరిగిన మహిళల హాకీ పోరులో గ్రేట్​ బ్రిటన్​ 0-2 తేడాతో గెలిచింది. ఫలితంగా మెరుగైన పాయింట్ల కారణంగా భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్​లో బెర్తు ఖరారు చేసుకుంది. 

16:36 July 31

సింధు ఓటమి...

బ్యాడ్మింటన్​ సెమీస్​లో పీవీ సింధు ఓటమి పాలైంది. తాయ్​పీ షట్లర్​ తై జూ సింధుపై విజయం సాధించింది.

16:19 July 31

బ్యాడ్మింటన్​ సెమీస్​ హోరాహోరీ..

ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్​ మహిళల సింగిల్స్​ సెమీస్​ పోరు రసవత్తరంగా సాగుతోంది. తెలుగు తేజం పీవీ సింధు- తాయ్​పీ షట్లర్​ తై జూ యంగ్​ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. తొలి సెట్​లో తై జూ గెలుపొందింది. అయితే సింధు కూడా గట్టిపోటీనిచ్చింది. ఫలితంగా 21-18తో తొలిసెట్​ను తై జూ దక్కించుకుంది.

16:00 July 31

పూజా రాణి ఔట్​..

  • బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశ
  • బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో పూజారాణి పరాజయం
  • చైనాకు చెందిన లీ క్యూ చేతిలో 0-5 తేడాతో పూజారాణి ఓటమి

11:21 July 31

షూటింగ్​లో మళ్లీ నిరాశే..

షూటింగ్​ మహిళల 50.మీ. రైఫిల్​ 3 పొజిషన్స్​లో భారత షూటర్లు నిష్క్రమించారు. కనీసం ఫైనల్​కు అర్హత సాధించలేకపోయారు.  

  • 1200 పాయింట్లకుగానూ 1167 సాధించిన అంజుమ్​ మౌద్గిల్ 15వ స్థానంలో నిలిచింది. నీలింగ్​(Kneeling), ప్రోన్​(Prone) పొజిషన్స్​లో 390, 395 చొప్పున చేసినప్పటికీ.. స్టాండింగ్​లో(Standing)​ చాలా తక్కువగా 382 మాత్రమే చేయడం ఆమెకు ప్రతికూలంగా మారింది.
  • మరో భారత షూటర్​.. తేజస్వినీ సావంత్​ 1154 స్కోరుతో 33లో నిలిచింది.

10:33 July 31

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హాకీలో మరో విజయం..

భారత మహిళల జట్టు హాకీలో మరో విజయం సాధించింది. పూల్​ ఏ లోని తన చివరి మ్యాచ్​లో సౌతాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచింది టీమ్​ ఇండియా. వందన కటారియా మూడు గోల్స్​ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. 

అయితే.. ఇవాళ జరిగే మరో మ్యాచ్​లో ఐర్లాండ్​ తన చివరి మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​ చేతిలో ఓడితేనే మన జట్టు క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. 

ప్రస్తుతం భారత్​.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మొత్తం ఆరు జట్లలో నాలుగు క్వార్టర్స్​ చేరుతాయి. 

08:17 July 31

ఫైనల్లో కమల్​ప్రీత్​ కౌర్​..

మహిళల డిస్కస్​త్రో ఫైనల్​కు కమల్​ప్రీత్ కౌర్ అర్హత సాధించింది. క్వాలిఫికేషన్​ రౌండ్​లోని గ్రూప్​ బిలో 2వ స్థానంలో నిలిచింది. మొత్తంగానూ రెండో స్థానమే. మొదటి ప్రయత్నంలో డిస్క్​ను 60.29 మీటర్ల విసిరిన కమల్​ప్రీత్.. రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల దూరం డిస్క్​ను విసిరి, ఫైనల్​కు అర్హత సాధించింది.

డిస్కస్ త్రో పోటీలో అమెరికా క్రీడాకారిణి అల్మన్ వలరీ తొలిస్థానంలో నిలిచింది. భారత్​కు చెందిన మరో ప్లేయర్ సీమా పునియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో తొలి 12 స్థానాల్లో నిలిచిన వారిని ఫైనల్‌కు ఎంపిక చేశారు. సోమవారం(ఆగస్టు 2) సాయంత్రం 4.30 గం.కు డిస్కస్ త్రో ఫైనల్ జరగనుంది.

07:43 July 31

భారత్​కు షాక్​.. బాక్సింగ్​లో అమిత్​ పంగాల్​ ఓటమి..

బాక్సింగ్​ పురుషుల 52 కేజీల విభాగంలో భారత ఫేవరేట్​ బాక్సర్​.. అమిత్​ పంగాల్​ ఓటమి పాలయ్యాడు. కొలంబియా బాక్సర్​ మార్టినెజ్​ రివాస్​ చేతిలో 4-1 తేడాతో ఓడి క్వార్టర్స్​ చేరకుండానే నిష్క్రమించాడు. 

07:32 July 31

ఆర్చరీ ప్రీక్వార్టర్స్​లో పోరాడి ఓడిన అతాను దాస్​..

ఆర్చరీలో భారత ప్రస్థానం ముగిసింది. పురుషుల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చర్​ అతాను దాస్​ పోరాడి ఓడాడు. జపాన్​ ఆర్చర్​ ఫురుకవా టకహరూ క్వార్టర్స్​లోకి ప్రవేశించాడు.

తొలి సెట్​ గెలిచిన జపాన్​ ఆర్చర్​ 2 పాయింట్లు సాధించగా.. రెండో సెట్​ టై అయింది. దీంతో స్కోరు 3-1గా ఉంది. తర్వాతి సెట్​ను అతాను కైవసం చేసుకోగా.. స్కోరు 3-3తో సమమైంది. మళ్లీ నాలుగో సెట్​ టై అయింది. కీలకమైన చివరిసెట్​లో అతాను కంటే ఓ పాయింట్​ ఎక్కువ స్కోర్​ చేసి.. 6-4 తేడాతో మ్యాచ్​ గెలిచాడు జపాన్​ ప్లేయర్​. 

06:36 July 31

డిస్కస్​ త్రో..

మహిళల డిస్కస్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​ ఏ లో .. భారత క్రీడాకారిణి సీమా పునియా డిస్క్​ను 60.57 మీటర్ల దూరం విసిరింది. తొలి ప్రయత్నంలో విఫలమైన పునియా.. రెండో సారి ఈ లక్ష్యం చేరుకుంది. మూడో ప్రయత్నంలో 58.93 మీ. దూరం విసిరింది. ఎక్కువ దూరం విసిరిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 

గ్రూప్​ ఏ లో 15 మంది, గ్రూప్​ బీ లో 16 మంది పోటీపడుతున్నారు. మొత్తంగా టాప్​-12లో నిలిచిన వారు ఫైనల్​కు అర్హత సాధిస్తారు. 

గ్రూప్​ ఏలో పునియా ఆరో స్థానంలో నిలిచింది. క్రొయేషియా, జర్మనీ, జమైకా త్రోయర్లు వరుసగా తొలి, రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

06:09 July 31

Olympics Live: అమిత్​, సింధు, అతానుపైనే అందరి దృష్టి

సింధు, అతాను, అమిత్​లకు డూ ఆర్​ డై..

  • టోక్యో ఒలింపిక్స్​లో నేడు భారత్​కు కీలకం. స్వర్ణం ఆశలు పెంచుతున్న పీవీ సింధు.. నేడు తై జు యింగ్​తో​(చైనీస్​ తైపీ) సెమీఫైనల్లో తలపడనుంది. అందులో గెలిస్తే ఫైనల్​కు చేరుతుంది. ఈ మ్యాచ్​ మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది.
  • ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్​ మ్యాచ్​ ఆడనున్నాడు అతాను దాస్​. ఈ పోరు ఉదయం 7.18 గంటలకు జరగనుంది. అందులో గెలిస్తే.. క్వార్టర్​ ఫైనల్​ చేరుతాడు.
  • బాక్సింగ్​ పురుషుల 52 కేజీల విభాగంలో.. భారత ఫేవరేట్​ బాక్సర్​ అమిత్​ పంగాల్​ రింగ్​లోకి దిగనున్నాడు. ఉదయం 7.30 నుంచి ఈ మ్యాచ్​ జరగనుంది. అందులో గెలిస్తే క్వార్టర్స్​ బెర్తు ఖాయం చేసుకుంటాడు.
  • ఇంకా.. మహిళల బాక్సింగ్​ 75 కేజీల విభాగంలో క్వార్టర్​ ఫైనల్లో తలపడనుంది పూజారాణి. అందులో గెలిస్తే భారత్​కు మరో పతకం ఖాయం కానుంది.

Last Updated : Jul 31, 2021, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.