ETV Bharat / sports

కోరికలు చంపుకుంటున్న అథ్లెట్లు.. అన్నీ పతకం సాధించిన తర్వాతే! - హిడిలిన్ డయాజ్

అథ్లెట్లు తమతమ క్రీడల్లో సత్తా చాటాలంటే వాళ్లకు ఫిట్​నెస్​ ఎంతోముఖ్యం! బాక్సింగ్​, వెయిట్​ లిఫ్టింగ్​ వంటి విభాగాల్లో పాల్గొనే ఆటగాళ్లు ఏళ్ల తరబడి ఓకే బరువును కొనసాగించాల్సి ఉంటుంది. అలా ఫిట్​గా ఉండాలంటే తమకు ఇష్టమైన జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలి. ఆ విధంగా అనేక మంది క్రీడాకారులు నోటికి పని చెప్పకుండా.. లక్ష్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైతే తమ లక్ష్యాన్ని చేరుకుంటారో.. నిమిషం ఆలస్యం చేయకుండా ఇష్టమైన ఫుడ్​ను లాగించేస్తున్నారు. ఇలా ఆహారం మీద మమకారంతో ఓ వెయిట్​ లిఫ్టర్​.. గెలిచిన ఆనందం కంటే ముందుగానే, తాను ఇకపై అన్ని తినబోతున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ సంగతేంటో చూద్దామా?

Athletes ignoring their favorite food for getting a medal in the Olympics
కోరికలు చంపుకుంటున్న అథ్లెట్లు.. అన్నీ పతకం సాధించిన తర్వాతే!
author img

By

Published : Jul 27, 2021, 8:29 PM IST

ఒలింపిక్స్​లో పతక విజేతగా నిలవాలనే తపనతో ఈ తరం అథ్లెట్లు డయిట్​ పేరుతో తిండిలో పరిమితి పెట్టుకుంటున్నారు. బ్యాడ్మింటన్​ స్టార్​ సింధు దగ్గర్నుంచి ఇటీవలే ఒలింపిక్స్​లో రజతం గెలిచిన మీరాబాయి వరకు.. చాలా మంది తమకు ఇష్టమైన ఆహారాన్ని వదిలేసి.. ఫిట్​నెస్​ నిత్యం కోసం తపనపడుతున్నారు.

Athletes ignoring their favorite food for getting a medal in the Olympics
పీవీ సింధు

ఇష్టమైన తిండికి దూరంగా..

పెరుగు అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్​ షట్లర్​ సింధు అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. కానీ, పెరుగు తింటే ఫిట్​నెస్​ను కాపాడుకోవడం కష్టమని.. అందుకే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు దానికి దూరంగా ఉంటానని చెప్పింది.

అదే విధంగా టోక్యో ఒలింపిక్స్​లో సత్తా చాటిన మణిపూర్​ గర్ల్​.. మీరాబాయి చానుకు పిజ్జా అంటే అమితమైన ప్రేమ. ఫిట్​నెస్​ కోసమే తనకు ఇష్టమైన ఫుడ్​ను దూరం పెట్టింది. ఇప్పుడు పతక విజేతగా నిలిచిన తర్వాత పిజ్జా తినేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన పిజ్జాలను మీరాబాయికి జీవితాంతం ఉచితంగా అందిస్తామని ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినొస్​ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది.

మీరాబాయి చాను

ఇలా తమకున్న చిన్న చిన్న కోరికలను చంపుకుని.. కలల వైపు ఎంతోమంది క్రీడాకారులు సాగిపోతున్నారు. ఓ సగటు క్రీడాకారుడు ఒలింపిక్స్​లో పాల్గొనాలంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఫిట్​నెస్​ కొనసాగిస్తూ.. ఆటపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తినే ప్రతి దాంట్లో తప్పక నిబంధన పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఒకే బరువుతో ఏళ్లపాటు..

ఉదాహరణకు చెప్పాలంటే బాక్సింగ్​, వెయిట్​ లిఫ్టింగ్​ క్రీడల్లో కేజీల విభాగాలుంటాయి. అందులో పాల్గొనే అథ్లెట్లు ఆ విభాగానికి ఏళ్లపాటు అదే బరువుతో ఉండాలి. అలా ఉండాలంటే చిరుతిండ్లు పూర్తిగా కట్టిపెట్టాల్సిందే! అయితే అన్ని ఏళ్ల కఠోర శ్రమకు తగిన ఫలితం లభిస్తే.. అథ్లెట్ల ఆనందానికి అవధులు ఉండవు. ఆ సంతోషంలో వాళ్లు చేయాలకున్న వాటన్నింటి జాబితా సిద్ధం చేస్తారు. ఫిట్​నెస్​ కోసం ఇన్నేళ్ల పాటు చేసిన డయిటింగ్​ను పక్కన పెట్టి వాళ్లకు ఇష్టమైన ఫుడ్​ను ఆస్వాదిస్తారు.

హిడిలిన్ డియాజ్

పోటీ అవ్వగానే తింటానంటూ..

ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్​ వేదికగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఫిలిప్పిన్స్​కు చెందిన ఓ వెయిట్​ లిఫ్టర్​ బరువులెత్తే సమయంలో.. ఇకపై తనకు నచ్చిన ఆహారాన్ని తినొచ్చు అనే ఆనందాన్ని ఒలింపిక్స్​ వేదికగా వ్యక్తపరిచింది. 55 కేజీల వెయిట్​ లిఫ్టింగ్​ విభాగంలో పాల్గొన్న హిడిలిన్ డియాజ్.. విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఆ విభాగంలో విజేతగా నిలిచిన ఆనందంలో.. తన చేతిలో ఉన్న బరువు దించుతూనే సంబరాలు చేసుకుంది. 'ఈ రోజు నుంచి ఎంత కావాలంటే అంత తింటాను' అంటూ ఆనందోత్సాహంతో మునిగితేలింది.

ఫిలిప్పిన్స్​నుంచి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లలో తొలిసారి పసిడి పతకం సాధించింది ఆమెనే కావడం విశేషం.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​ వేళ టోక్యోను కలవరపెడుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.