ETV Bharat / sports

'కెంటకీ'తో టెన్నిస్​ స్టార్​ సెరెనా పునరాగమనం - serena tennis news

అమెరికా టెన్నిస్​ తార సెరెనా విలియమ్స్​ త్వరలోనే మళ్లీ టెన్నిస్​ కోర్టులో కనబడబోతోంది. వచ్చే నెలలో జరిగే కెంటకీ హార్డ్​కోర్ట్​ టోర్నీలో ఆమె బరిలోకి దిగబోతోంది.

serena williams latest news
కెంటకీతో టెన్నిస్​ స్టార్​ సెరెనా పునరాగమనం..
author img

By

Published : Jul 18, 2020, 10:47 AM IST

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ క్రీడా టోర్నీలన్నీ దాదాపుగా వాయిదాపడ్డాయి. ఫలితంగా క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే లాక్​డౌన్​ మినహాయింపుల్లో భాగంగా పలు దేశాల్లో క్రీడలకు సంబంధించిన టోర్నీలు మొదలవుతున్నాయి. టెన్నిస్ పోటీలు కూడా పునః ప్రారంభం కానున్నాయి.

ఈ పోటీల ద్వారా అమెరికా టెన్నిస్​ స్టార్​ సెరెనా విలియమ్స్​ మళ్లీ రాకెట్​ పట్టేందుకు సిద్ధమౌతోంది. ఆగస్టు 10 నుంచి ప్రారంభమయ్యే కెంటకీ హార్డ్​కోర్ట్​ టోర్నీలో ఆమె బరిలోకి దిగబోతోంది. 2017 యూఎస్​ ఓపెన్​ ఛాంపియన్​ స్లోన్​ స్టీఫెన్స్​ కూడా పాల్గొననుందని నిర్వాహకులు వెల్లడించారు.

23 సార్లు గ్రాండ్​స్లామ్​ సింగిల్స్​ విజేత అయిన సెరెనా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిగా ఫెడ్​కప్​ ఆడింది.

ఇదీ చూడండి: యూఎస్​ ఓపెన్​ ఆడేందుకు సెరెనా సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.