ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. టాప్ సీడ్ ఓపెన్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఓటమిపాలైంది. ఈమెపై 1-6, 6-4, 7-6 పాయింట్ల తేడాతో 116వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ విజయం సాధించింది. 100కు పైగా ర్యాంక్ ఉన్న ఓ క్రీడాకారిణి చేతిలో ఓడిపోవడం గత ఎనిమిదేళ్లలో సెరెనాకు ఇదే తొలిసారి. తన కెరీర్లో 967 సింగిల్స్ మ్యాచ్‌లాడిన ఈమె.. ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే 100 లేదా అంతకంటే పెద్ద ర్యాంకర్ చేతిలో ఓడింది.
ఆగస్టు 31 నుంచి మొదలయ్యే యుఎస్ ఓపెన్‌లోనూ బరిలోకి దిగనుంది సెరెనా. ఇందులో గెలిచి మార్గరెట్ కోర్టు పేరిట ఉన్న 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేయాలని చూస్తోంది.