ETV Bharat / sports

ATP Cup 2022: ఏటీపీ కప్​లో ఆడనున్న జకోవిచ్

ATP Cup 2022: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది జరగనున్న ఏటీపీ కప్​లో ఆడనున్నట్లు టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేశారు. సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది.

novak djokovic
నొవాక్ జకోవిచ్
author img

By

Published : Dec 7, 2021, 5:53 PM IST

ATP Cup 2022: ప్రపంచ నంబర్​ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఏటీపీ కప్​లో సెర్బియా తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే.. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియా ఓపెన్​లో తాను పాల్గొనకపోవచ్చని చెప్పి జకోవిచ్ ఇటీవలే వార్తల్లో నిలిచాడు. కొవిడ్ టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఏటీపీ కప్​ నిర్వాహకులు జకోవిచ్​ తమ టోర్నీలో పాల్గొంటాడని చెప్పడం గమనార్హం.

సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న ఈ టోర్నీలో 16 దేశాలు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ టాప్​ 20 ఆటగాళ్లలో 18 మందిని ఎంపిక చేసినట్లు టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. అందులో జకోవిచ్​ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.

కాంట్రవర్సీ మొదలైందిలా..

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ మెల్​బోర్న్​లో జరగనుంది. ఈ నేపథ్యంలో అథ్లెట్లందరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు నిర్వాహకులు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి వీసాలు మంజూరు చేయబోమని ఆస్ట్రేలియా అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రకటన అనంతరం.. గ్రాండ్​స్లామ్​లో పాల్గొనకపోవచ్చని జకోవిచ్​ చెప్పాడు.

అయితే.. ఏటీపీ కప్​లో పాల్గొనేందుకు మాత్రం ఇలాంటి నిబంధనలేమీ లేవు. ఈ నేపథ్యంలో నొవాక్​కు ఎంట్రీ లభించింది.

ఇప్పటివరకు జకోవిచ్​ తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా గ్రాండ్​స్లామ్​ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో నొవాక్​ జకోవిచ్ ఓటమిపాలయ్యాడు​. ఈ ఏడాది 'క్యాలెండర్‌ స్లామ్‌' సాధించి చరిత్ర సృష్టించాలన్న అతని కలకు మెద్వెదెవ్​ అడ్డుకట్ట వేశాడు.

ఇదీ చదవండి:

Australian Open: ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు జకోవిచ్ దూరం?

రాకెట్‌ నేలకేసి కొట్టి.. కంటతడి పెట్టిన జకోవిచ్‌!​

Wimbledon 2022: వింబుల్డన్‌కూ ఫెదరర్‌ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.