ETV Bharat / sports

T20 World Cup: భారత్ ఘోర పరాజయం.. సెమీస్​ ఆశలు గల్లంతు! - భారత్ X న్యూజిలాండ్ టీ20

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియాపై అలవోకగా గెలిచింది న్యూజిలాండ్. భారత్​ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఛేదించింది.

ind vs nz
భారత్, న్యూజిలాండ్
author img

By

Published : Oct 31, 2021, 10:27 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్​ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్​ మిచెల్​ 49 పరుగులతో అదరగొట్టి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టీమ్​ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. ఇషాన్​ కిషన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చినా జట్టుకు శుభారంభం దక్కలేదు. ఇషాన్​(4), కేఎల్​ రాహుల్(18), రోహిత్​ శర్మ(14), విరాట్​ కోహ్లీ(9) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. అనంతరం రిషభ్ పంత్ 12 పరుగుల వద్ద మిల్నే బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

చివరిదశలో హార్దిక్​ పాండ్య(23) పరుగులతో రాణించినా బౌల్ట్​ వేసిన ఓవర్లో ఔటయ్యాడు. జట్టులో అవకాశం దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగైనా చేయకుండానే పెవిలియన్ చేరాడు. చివర్లో రవీంద్ర జడేజా 26 పరుగులతో రాణించడం వల్ల గౌరవప్రదమైన స్కోరు నమోదైంది.

ఈ మ్యాచ్ ఓటమితో టీమ్​ఇండియాకు సెమీస్​ ఆశలు గల్లంతయ్యాయి. మరో మూడు మ్యాచ్​లు గెలిచినా టీమ్​ఇండియా సెమీస్​ చేరడం కష్టమే.

ఇదీ చదవండి:

IND vs NZ T20: చేతులెత్తేసిన టీమ్​ఇండియా.. కివీస్​ లక్ష్యం 111

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.