టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) స్కాట్లాండ్తో మ్యాచ్‌కు (India vs Scotland) ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ట్రోఫీ గెలవకపోతే చేసిన పరుగులకు, సాధించిన సెంచరీలకు ఎలాంటి విలువ ఉండదని అన్నాడు.
"2016తో పోలిస్తే బ్యాటర్‌గా ఎంతో పరిణతి చెందాను. జట్టుకు ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం. వ్యక్తుల కన్నా జట్టే ప్రధానం. ఆ సమయానికి వ్యక్తిగతంగా కన్నా జట్టుకు ఏది సరైందో అదే చేయాలి. ఒక షాట్ ఎంచుకునే ముందు జట్టుకు కావాల్సింది ఇదేనా అని ఆలోచించాలి."
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా బ్యాటర్
2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ 5 సెంచరీలు (Rohit Sharma World Cup Centuries) సాధించాడు. ఆ టోర్నీ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా ఓటమిపాలైంది. వ్యక్తిగతంగా ఈ టోర్నీ అంటే తనకు చాలా ప్రత్యేకమని చెప్పాడు రోహిత్. తన ప్రణాళికలను సరిగ్గా అమలు చేసి పరుగులు రాబట్టడమే అందుకు కారణమన్నాడు.
"ఏదైనా టోర్నీలో మన ప్లాన్ సఫలమైతే ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ, నిజాయితీగా చెప్పాలంటే ట్రోఫీ గెలవకపోతే.. ఎన్ని పరుగులు చేసినా, ఎన్ని సెంచరీలు సాధించినా వాటికి విలువ ఉండదు." అని చెప్పాడు రోహిత్.
ఇదీ చూడండి: 'రోహిత్-రాహుల్‌పైనే ఆధారపడితే ఎలా?'