Life ban on wrestler Satender Malik: భారత రెజ్లర్ సతేందర్ మాలిక్‌పై జీవిత కాల నిషేధం విధించారు. పోటీలు జరుగుతున్న సమయంలో ఓ రిఫరీతో అనుచితంగా ప్రవర్తించడం సహా అతడిపై దాడి చేయడం వల్ల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ శిక్ష విధించింది.
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం భారత్‌లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో 125 కేజీల విభాగంలో సర్వీసెస్ జట్టుకు చెందిన రెజ్లర్ సతేందర్ మాలిక్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫలితం తనకు వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయిన అతడు సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్‌పై చేయి చేసుకున్నాడు. దీన్ని ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేపథ్యంలో అతడిపై చర్యలు తీసుకుని నిషేధం విధించింది.
కాగా, ఈ ట్రయల్స్‌లో రవి దహియా(57 కేజీ), బజరంగ్ పునియా(65 కేజీ), నవీన్(74 కేజీ), దీపక్ పునియా(86 కేజీ), దీపక్(97 కేజీ), మోహిత్ దహియా(125 కేజీ) సెలెక్ట్ అయ్యారు.
ఇదీ చూడండి: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్.. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్లో!