ETV Bharat / sports

ఫైనల్​కు దూసుకెళ్లిన నీరజ్​ చోప్రా, అన్నురాణి - Neeraj chopra goes to final

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న క్వాలిఫికేషన్​ రౌండ్​లో భారత అథ్లెట్లు అన్నురాణి, నీరజ్​ చోప్రా మంచి ప్రదర్శన చేశారు. ప్రత్యర్థుల కన్నా ఎక్కువ దూరం బల్లెం విసిరి ఫైనల్​కు దూసుకెళ్లారు.

Neeraj chopra
ఫైనల్​కు దూసుకెళ్లిన నీరజ్​ చోప్రా,
author img

By

Published : Jul 22, 2022, 7:01 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు. క్వాలిఫికేషన్​ రౌండ్​లో 88.39 మీటర్ల దూరం బల్లెం విసిరి ఫైనల్​కు చేరుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌.. ఇటీవలే స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. అయితే డైమండ్‌ లీగ్‌లో 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయిన నీరజ్‌.. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్​లో ఎంత దూరం వరకు జావెలిన్‌ను విసురుతాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో భారత అథ్లెట్స్​ అన్నురాణి ఫైనల్​కు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్‌లో తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన అన్ను.. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 55.35 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగింది. కానీ పుంజుకున్న ఆమె మూడో ప్రయత్నంలో 59.60 మీటర్ల దూరం విసిరి గ్రూప్‌-బిలో అయిదో స్థానంతో ముందంజ వేసింది. ఈ గ్రూప్‌లో హరుకా కిటగూచి (64.32 మీటర్లు) అగ్రస్థానం సాధించగా.. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న మ్యాగీ మలోన్‌ (అమెరికా, 54.19 మీ) 12వ స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరలేకపోయింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఫైనల్‌ చేరడం అన్నుకు వరుసగా ఇది రెండోసారి. 2019 దోహా క్రీడల్లో తుది సమరానికి అర్హత సాధించిన భారత స్టార్‌.. ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జాతీయ రికార్డు (63.82 మీ) ఖాతాలో ఉన్న అన్ను.. ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేస్తే పతకం రేసులో నిలిచే అవకాశం ఉంది. మహిళల 5000 వేల మీటర్ల పరుగులో పరుల్‌ చౌదరి సెమీఫైనల్‌ చేరడంలో విఫలమైంది. హీట్‌-2లో ఆమె 15 నిమిషాల 54.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 17వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో దక్షిణాఫ్రికా తార కాస్టెర్‌ సెమన్యా (15 నిమిషాల 46.12 సె) సెమీస్‌ చేరలేకపోయింది.
400 మీ.హర్డిల్స్‌ ఫైనల్లో మెక్‌లాలిన్‌: మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకానికి గట్టిపోటీదారులు సిడ్నీ మెక్‌లాలిన్‌, దాలియా మహ్మద్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ అమెరికా రన్నర్లు తమ హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. దాలియా 53.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరగా.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ మెక్‌లాలిన్‌ 52.17 సెకన్లలో ఫినిషింగ్‌ లైన్‌ను తాకింది. మరోవైపు పురుషుల 100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచిన ఫ్రెడ్‌ కెర్లీ.. 4×100 మీటర్ల రిలే రేసుకు గాయంతో దూరమయ్యాడు. 200 మీటర్ల సెమీఫైనల్‌ రేసు సందర్భంగా ఫ్రెడ్‌ కాలికి గాయమైంది. అయితే అతడు దూరమైనా... 2019 టోర్నీలో 100 మీటర్ల విజేత క్రిస్టియన్‌ కోల్‌మన్‌ రూపంలో అమెరికాకు మంచి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి: విండీస్​తో వన్డే పోరుకు టీమ్​ఇండియా రెడీ.. ధావన్‌ కెప్టెన్సీలో అమీతుమీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.