ETV Bharat / sports

Olympics 2021: రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​​పై తాత్కాలిక నిషేధం - sonam malik wrestling tokyo olympics

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) (WFI) ఇద్దరు రెజ్లర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఒలింపిక్ గ్రామంలో అమర్యాదగా ప్రవర్తించిన వినేశ్​ ఫొగాట్​పై (Vinesh Phogat) తాత్కాలిక నిషేధం విధించింది. మరో క్రీడాకారిణి సోనమ్ (Sonam Malik Wrestling)​​ దుష్ప్రవర్తనకు గానూ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

Vinesh Phogat, Sonam
వినేశ్ ఫొగాట్, సోనమ్
author img

By

Published : Aug 10, 2021, 7:38 PM IST

భారత​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​పై (Vinesh Phogat) తాత్కాలిక నిషేధం విధించింది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) (WFI). టోక్యో ఒలింపిక్స్​ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు గడువు ఇచ్చింది. దుష్ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్​​​కు (Sonam Malik Wrestling) కూడా డబ్ల్యూఎఫ్​ఐ​ నోటీసులు జారీ చేసింది.

కారణమిదేనా?

ఒలింపిక్స్​కు ముందు శిక్షణ కోసం కోచ్​ వోల్లర్​ అకోస్​తో కలిసి హంగేరీకి వెళ్లింది వినేశ్​ (Vinesh Phogat). అక్కడి నుంచి నేరుగా ఈవెంట్​ సమయానికి టోక్యోకు చేరుకుంది. భారత అథ్లెట్లు సోనమ్​, అన్షు మాలిక్, సీమా బిస్లా ఉన్న దగ్గర ఆమెకు గదిని కేటాయించారు. అయితే అక్కడ ఉండటానికి వినేశ్​ నిరాకరించింది. పైగా, వారంతా ఇండియా నుంచి వచ్చారు. వారికి కొవిడ్​ ఉండే అవకాశం ఉందని కారణంగా తెలిపింది. దీంతోపాటు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్​ చేసే శిబిరం దగ్గర శిక్షణ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపలేదు వినేశ్​. ఆమె పాల్గొన్న మ్యాచ్​ల్లోనూ అధికారిక స్పాన్సర్​ జెర్సీని కాకుండా వేరేది ధరించింది. చివరికి పతకం సాధిస్తుందనుకున్నా ఆశలకు గండికొడుతూ సెమీస్​లోనే నిష్క్రమించింది. ​

"వినేశ్ తప్పుచేసింది. ఒలింపిక్ గ్రామంలో చాలా అమర్యాదగా ప్రవర్తించింది. అందుకే ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాం. ఈ విషయంపై వివరణ ఇచ్చే వరకు ఏ విధమైన పోటీల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇది క్షమించాల్సిన విషయం కాదు. సీనియర్​ రెజ్లర్లు ప్రవర్తించాల్సిన విధానం ఇది కాదు. ఇదే మా చివరి నిర్ణయం.

- భారత రెజ్లింగ్​ సమాఖ్య.

పాస్​పోర్ట్​ మీరే తేవాలి..

రెజ్లింగ్​ సమాఖ్య తమ అథ్లెట్లను ఎందుకు నియంత్రించలేకపోతుందనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ భారత ఒలింపిక్​ సంఘం (ఐఓఏ) డబ్ల్యూఎఫ్​ఐకి నోటీసులు జారీ చేసింది. దీంతో చేసేదేమి లేక వీరిద్దరిపై చర్యలు తీసుకుంది డబ్ల్యూఎఫ్ఐ.

మరో అథ్లెట్​ సోనమ్​​కు కూడా భారత రెజ్లింగ్ సమాఖ్య నోటీసులు జారీ చేసింది. టోక్యోకు చేరుకోవడానికి ముందు ​డబ్ల్యూఎఫ్​ఐ కార్యలయానికి వెళ్లి పాస్​పోర్ట్​ తీసుకోవాల్సి ఉండగా సోనమ్​ నిరాకరించింది. ఆ పని చేయాల్సింది స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​) అధికారులని ఆమె పేర్కొంది.

"ఈ రెజ్లర్లు ఏమి సాధించలేదు. కానీ, మేము స్టార్​ రెజ్లర్లం. మేము ఏం చేసిన చెల్లుతుందనే ధోరణిలో వారు ప్రవర్తిస్తున్నారు. ఇది సరికాదు."

-డబ్ల్యూఎఫ్​ఐ.

ఇదీ చదవండి: 'ఆ కోచ్​లపై నమ్మకం లేదు.. వినేశ్​కు నేనే శిక్షణనిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.