ETV Bharat / sports

Uber cup: పీవీ సింధు జోరు.. క్వార్టర్స్​లో భారత్​

Uber cup 2022 PV Sindhu: ఉబెర్​ కప్​ 2022లో భారత్​ 4-1తేడాతో యూఎస్​ఏను ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​లో అడుగుపెట్టింది. పీవీ సింధు 21-10, 21-11 తేడాతో గెలవగా.. మిగతా భారత ప్లేయర్లు కూడా మంచి ప్రదర్శన చేసి టోర్నీలో మరో అడుగు ముందుకేశారు.

Uber cup 2022 PV Sindhu
పీవీ సింధు ఉబర్​ కప్​
author img

By

Published : May 10, 2022, 2:08 PM IST

Updated : May 10, 2022, 2:24 PM IST

Uber cup 2022 PV Sindhu: థామస్​ అండ్​ ఉబెర్​ కప్​లో భారత్​ దూసుకెళ్తోంది. నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో మరో అడుగు ముందుకేసి క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకుంది ఇండియా​. గ్రూప్​ డి విభాగంలో తొలి మ్యాచ్​లో.. ప్రపంచ నెం.7 సింధు 21-10, 21-11 తేడాతో అమెరికాకు చెందిన జెన్ని గాయ్​ను ఓడించింది. ఈ పోరు 26 నిమిషాల పాటు సాగింది. రెండో మ్యాచ్​ మహిళల డబుల్స్​లో భారత ద్వయం తనీషా క్రాస్టో, త్రీసా జాలీ.. 21-19, 21-10 తేడాతో ఫ్రాంసీసా(Francesca Corbett)-అలీసన్​ లీ జోడీని 34 నిమిషాల్లో ఓడించింది.

మూడో మ్యాచ్​లో యూఎస్​ఏకు చెందిన ఎస్తర్​ షిపై భారత ప్లేయర్​ ఆకార్షి కష్యప్​ 18-21,11-21 తేడాతో గెలుపొందింది. 34 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్​. ఇక శ్రుతి మిష్రా-సిమ్రాన్​ సింఘి జోడీ.. లారెన్​ లామ్​-కోడి తాంగ్​ లీ చేతిలో 12-21, 21-17, 21-13 తేడాతో ఓడిపోయింది.

చివరి మ్యాచ్​లో అష్మితా చాలితా.. నటాలి చి 21-18,21-13 తేడాతో 31 నిమిషాల్లో ఓడించింది. మొత్తంగా భారత్​ జట్టు 4-1తేజాతో యూఎస్​ఏను ఓడించి క్వార్టర్​ఫైనల్​లో అడుగుపెట్టింది.

ఇదీ చూడండి: రోహిత్‌శర్మ నాటౌట్‌.. థర్డ్‌ అంపైర్‌పై నెటిజన్ల ఫైర్

Last Updated : May 10, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.