ETV Bharat / sports

'థామస్‌ కప్‌లో భారత జట్టుది అద్భుత ప్రయాణం' - undefined

కిదాంబి శ్రీకాంత్‌.. సాత్విక్‌ సాయిరాజు.. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ సాధించిన భారత బృందంలో కీలక సభ్యులైన ఈ ఇద్దరూ తెలుగు వాళ్లే. బ్యాంకాక్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న ఈ ఇద్దరూ తాము సాధించిన చారిత్రక విజయంపై 'ఈనాడు- ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.​

thamus cup
థామస్‌ కప్‌
author img

By

Published : May 21, 2022, 7:14 AM IST

థామస్‌ కప్‌లో విజేతగా నిలిచినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు కిదాంబి శ్రీకాంత్‌. విజేతగా నిలవడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. "క్వార్టర్స్‌ నుంచి ఫైనల్‌ వరకు ప్రత్యర్థులంతా మాజీ ఛాంపియన్లే. మనది కూడా బలమైన జట్టే. అందుకే ఆయా జట్ల గత ప్రదర్శనల గురించి పట్టించుకోలేదు. ఆరోజు బాగా ఆడిన జట్లే గెలుస్తుంది. అందుకే ఏమవుతుందో చూద్దామన్న దృక్పథంతో బరిలో దిగాం. 43 ఏళ్ల కిందట థామస్‌ కప్‌లో కాంస్యం వచ్చింది. ఆ తర్వాత ఫార్మాట్‌ పూర్తిగా మారిపోయింది. కొత్త ఫార్మాట్‌లో భారత్‌ ఒక్క పతకం నెగ్గలేదు. కనీసం సెమీస్‌కు కూడా రాలేదు. ఈసారి అవకాశం ఉందని అనుకున్నాం" అని పేర్కొన్నారు శ్రీకాంత్​. టోర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే..

Kidambi Srikanth
కిదాంబి శ్రీకాంత్‌

కెప్టెన్‌గా బాధ్యత: థామస్‌ కప్‌ టీమ్‌ ఈవెంట్‌. ప్రతి పోరులో 5 మ్యాచ్‌లు. తొలి రెండింట్లో ఒకటి.. చివరి రెండింట్లో ఒకటి.. మధ్యలో నా మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలన్నది వ్యూహం. క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్లో ఇదే వ్యూహాన్ని పాటించాం. నా దగ్గరికొచ్చేసరికి మ్యాచ్‌ కీలకంగా మారిపోయేది. క్వార్టర్స్‌, సెమీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. టీమ్‌ ఈవెంట్లో సీనియర్‌ ఆటగాడి నుంచి జట్టుకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. మంచి ప్రదర్శన ఆశిస్తారు. నా మ్యాచ్‌లో గెలిస్తే జట్టుకు సానుకూలత ఉంటుందని అనుకున్నాం. కెప్టెన్‌గా నాపై అదనపు బాధ్యత కూడా ఉంది. అదృష్టవశాత్తు అన్ని మ్యాచ్‌ల్లో గెలిచా. ఫైనల్లో లక్ష్యసేన్‌, సాత్విక్‌- చిరాగ్‌ జోడీ గెలవడంతో భారత్‌ 2-0తో ఆధిక్యం సంపాదించింది. లక్ష్య, సాత్విక్‌ జోడీ అద్భుతంగా ఆడారు. జట్టు విజయంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికీ నా అత్యుత్తమ ఆటతీరు బయటకు రాలేదనే అనుకుంటున్నా. ఇంకా మెరుగ్గా ఆడగలను. రానున్న ఒలింపిక్స్‌లో నా అసలు ఆట చూస్తారు.

అకాడమీతో అనుబంధం: చిన్న చిన్న విషయాలు మమ్మల్ని జట్టుగా నడిపించాయి. అందరం కలిసి జిమ్‌కు వెళ్లేవాళ్లం. అదరం కలిసి బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ చేసేవాళ్లం. అంతా జట్టుగా చేయాలని అనుకునేవాళ్లం. గోపీచంద్‌ అకాడమీలో పదేళ్లకు పైగా అందరం కలిసే ఉంటున్నాం. చాలా ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. మాకిది కొత్తకాదు. టోర్నీకి ఒకరోజు ముందు కలుసుకుని, ఒకరినొకరు పరిచయం చేసుకునే పరిస్థితి కాదు. సుదీర్ఘంగా కలిసి ఉండటం మాలో అనుబంధాన్ని పెంచింది. టీమ్‌ ఈవెంట్లో సమష్టితత్వం కనిపించింది. జట్టు సమావేశాల్లో అందరినీ మాట్లాడనిచ్చాం.

మరింత కష్టపడాలి: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా, ఇండోనేసియా, మలేసియా, కొరియా, జపాన్‌ వంటి ముందున్నాయి. థామస్‌ కప్‌లో భారత్‌ మొదటి 4 స్థానాల్లో కూడా లేదు. అలాంటిది టైటిల్‌ గెలిచాం. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో మనమే టాప్‌. భారత్‌కు ఆ అర్హత ఉంది. థామస్‌ కప్‌లో మనం గెలిచాం.. వాళ్లు ఓడారు. వచ్చేసారి వాళ్లు బాగా సాధన చేసి వస్తారు. ఈ ప్రదర్శనను భారత్‌ కొనసాగించడం అత్యంత కీలకం. ఎప్పుడు ఆడినా నిలకడగా రాణించాలి. గెలిచాం కదా అని ఏమరుపాటుగా ఉండకూడదు. మరింత ఎక్కువ కష్టపడాలి.

కసితో టోర్నీ నెగ్గాం: సాత్విక్‌

Satwik saira
సాత్విక్‌ సాయిరాజు

థామస్‌ కప్‌లో భారత జట్టుది అద్భుతమైన ప్రయాణం. టోర్నీ ఆసాంతం మరిచిపోలేని మధురానుభూతులు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌ నుంచి ఫైనల్‌ వరకు విశేషాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. థామస్‌ కప్‌లో ఎప్పుడూ భారత్‌ బలమైన జట్టులో బరిలో దించినా క్వార్టర్స్‌ దాటలేకపోయింది. కిందటి సారి క్వార్టర్స్‌లో డెన్మార్క్‌ చేతిలో ఓడిపోయాం. ఈసారి పతకం సాధించాలన్న కసితో వెళ్లాం. శ్రీకాంత్‌, ప్రణయ్‌, లక్ష్యసేన్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో ఆత్మవిశ్వాసం వచ్చింది. మొత్తంగా జట్టంతా మంచి ఫామ్‌లో ఉంది. కచ్చితంగా క్వార్టర్స్‌ దాటాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం. క్వార్టర్స్‌లో గెలవగానే గాల్లో తేలిపోయాం. అన్నీ మరిచిపోయాం. సంబరాలు అంబరాన్ని తాకాయి. ఫైనల్‌ గెలిచినప్పుడు కూడా అంత సంతోషించలేదేమో. రాత్రంతా నృత్యాలు చేశాం. గెంతులు వేస్తూ కేరింతలు కొట్టాం. మరుసటి రోజు సెమీస్‌ మ్యాచ్‌ ఉందన్న సంగతే మరిచిపోయాం.

ఆ మ్యాచే స్ఫూర్తి: స్వర్ణం గెలుస్తామని అనుకోలేదు. సెమీస్‌, ఫైనల్లో ఫలితాల గురించి ఆలోచించలేదు. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్నాం.. మున్ముందు బాగా ఆడితే గెలుస్తాం.. అదంతా బోనస్‌ అని మాత్రమే అనుకున్నాం. కచ్చితంగా గెలవాలన్న అంచనాల్ని మీద వేసుకోలేదు.. ఓడిపోతామన్న ఒత్తిడిని దరిచేరనీయలేదు. డెన్మార్క్‌, కొరియా జట్ల మధ్య క్వార్టర్స్‌ మ్యాచ్‌లో మాలో స్ఫూర్తి రగిల్చింది. ఓడిపోయే దశ నుంచి డెన్మార్క్‌ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తిప్పేసింది. అంత ఒత్తిడిలో పుంజుకోవడమెలాగో డెన్మార్క్‌ను చూసి నేర్చుకున్నాం. ఫైనల్లో రెండో గేమ్‌లో 17-20తో మ్యాచ్‌ను కోల్పోయే దశ నుంచి విజయం సాధించడానికి డెన్మార్క్‌ మ్యాచే స్ఫూర్తి.

కలవరిస్తూనే ఉన్నాడు: ఫైనల్‌కు ముందు జట్టు సమావేశంలో మాట్లాడుకున్నాం. సీనియర్లకు ఒకటే చెప్పా. 'భారత్‌ ఫైనల్‌ చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఇండోనేసియా కూడా షాక్‌లో ఉంది. వాళ్లపై ఒత్తిడి ఉంటుంది. మనపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆటను ఆస్వాదిద్దాం' అని తెలిపా. ఫైనల్లో లక్ష్య విజయం మలుపు. ఈ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. మరింత ఉత్సాహంతో మిగతా రెండు మ్యాచ్‌లు ఆడి విజేతగా నిలిచాం. ఛాంపియన్స్‌ అయ్యాక మేం చేస్తున్నామో మాకే తెలియలేదు. ఉదయం 5 గంటల వరకు ఎవరూ పడుకోలేదు. మ్యాచ్‌ తర్వాత స్నానాలకు వెళ్లినా మెడలో నుంచి పతకాలు తీయలేదు. అంటూ కలవరిస్తూనే ఉన్నాడు.

మేమూ ప్రేరణే: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. ఆటను అభిమానించే వాళ్లకు ఈ విషయం తెలుసు. 1983 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలుపుతో సమానం ఇది. థామస్‌ కప్‌ నెగ్గిన భారత జట్టులో నేనూ సభ్యుడినని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని యువత భావిస్తుండేది. ఇప్పుడు మేం కూడా వాళ్లకు ప్రేరణ అవుతామని అనుకుంటున్నా. మౌలిక వసతులు, అవకాశాలకు కొదవలేదు. గొప్పవాళ్లు చెప్పినట్లు పెద్ద కలలు కనండి. తప్పకుండా సాకారం అవుతాయి. అందుకు థామస్‌ కప్‌ విజయమే ఉదాహరణ.

ఇదీ చదవండి: 'అనిల్‌ రావిపూడితో పనిచేస్తే ఒత్తిడి ఉండదు'

For All Latest Updates

TAGGED:

thamus cup
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.