Wrestling Federation New President : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం 2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్, రెజ్లర్ అనిత షెరాన్‌కు యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీ పడ్డారు. అయితే 40 ఓట్ల తేడాతో ఆఖరికి సంజయ్‌దే పై చేయిగా నిలిచింది. అయితే ఈయన రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు అనుచరుడిగా సుపరిచితుడే.
-
VIDEO | "It is obvious to feel good because truth has won over lie," says newly elected WFI President Sanjay Singh.
— Press Trust of India (@PTI_News) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video is available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aogulzfsAM
">VIDEO | "It is obvious to feel good because truth has won over lie," says newly elected WFI President Sanjay Singh.
— Press Trust of India (@PTI_News) December 21, 2023
(Full video is available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aogulzfsAMVIDEO | "It is obvious to feel good because truth has won over lie," says newly elected WFI President Sanjay Singh.
— Press Trust of India (@PTI_News) December 21, 2023
(Full video is available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aogulzfsAM
ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా సంజయ్ గతంలో పనిచేశారు. 2019 నుంచి డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శిగానూ ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే ఇదే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ స్థానం కోసం రేసులో ఉన్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటమి పాలయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీ జనరల్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజ్‌రంగ్, వినేశ్, సాక్షి మలిక్ తదితర స్టార్ రెజ్లర్లు ధర్నాకు దిగారు. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. వారి స్థానంలో సమాఖ్య రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం భారత ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నించగా కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
-
VIDEO | Celebrations galore at Brij Bhushan Sharan Singh's residence in Delhi after his loyalist Sanjay Singh gets elected as the new WFI President. pic.twitter.com/Wgt07PIijT
— Press Trust of India (@PTI_News) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Celebrations galore at Brij Bhushan Sharan Singh's residence in Delhi after his loyalist Sanjay Singh gets elected as the new WFI President. pic.twitter.com/Wgt07PIijT
— Press Trust of India (@PTI_News) December 21, 2023VIDEO | Celebrations galore at Brij Bhushan Sharan Singh's residence in Delhi after his loyalist Sanjay Singh gets elected as the new WFI President. pic.twitter.com/Wgt07PIijT
— Press Trust of India (@PTI_News) December 21, 2023
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే 7న ఫెడరేషన్ ఎన్నికలు జరగాల్సింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఎలక్షన్‌ను నిలిపివేసింది. ఆ తర్వాత జూన్ 30 ఎన్నికలు ఉంటాయని అప్పుడు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆ తర్వాత జులై 4న ఎన్నికలు నిర్వహిస్తామని ఐఓఏ పేర్కొంది. కానీ జులై 6న ఎలక్షన్స్ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. కానీ తమకూ ఓటు హక్కుందని, గుర్తింపు కోల్పోయిన అయిదు సంఘాలు కోర్టుకు అప్పుడు కూడా ఎన్నికలను వాయిదా వేశారు. ఇక పంజాబ్-హరియాణా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడింది. ఆఖరికి డిసెంబరు 21న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది.