ETV Bharat / sports

సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు.. ప్రధాని మోదీ అభినందనలు

పీవీ సింధు
పీవీ సింధు
author img

By

Published : Jul 17, 2022, 11:45 AM IST

Updated : Jul 17, 2022, 2:24 PM IST

11:42 July 17

సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు సింగపూర్​ ఓపెన్​ టైటిల్​ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్​ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్​లో తొలి సూపర్​ 500 టైటిల్​ను దక్కించుకుంది డబుల్​ ఒలింపిక్ మెడలిస్ట్​ అయిన సింధు. ఆసియా ఛాంపియన్​షిప్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, 22 ఏళ్ల వాంగ్​.. సింధు ముందు తేలిపోయింది. తొలి సెట్​ను అలవోకగా నెగ్గిన భారత షట్లర్​.. రెండో సెట్​ను 11-21తో కోల్పోయింది. మూడో సెట్​ను మళ్లీ 21-15తో గెల్చుకొని.. ట్రోఫీని కైవసం చేసుకుంది.

సింగపూర్​ ఓపెన్​లో సింధు విజేతగా నిలవడంపై ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. "తొలి సింగపూర్​ ఓపెన్​ టైటిల్​ను​ గెలుచుకున్న పీవీ సింధుకు నా అభినందనలు. మరోసారి తన అద్భుతమైన క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి విజయం సాధించింది. ఇది దేశం గర్వించే క్షణం. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది." అని ట్వీట్​ చేశారు.

జులై 28 నుంచి బర్మింగ్​హామ్​లో జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు ముందు ఈ విజయం సింధుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఈ సీజన్​లో సింధుకు మొత్తంగా ఇది మూడో టైటిల్​. ఇప్పటికే 2022లో రెండు సూపర్​ 300 టైటిళ్లు గెల్చుకుంది సింధు. ఇందులో సయ్యద్​ మోదీ ఇంటర్నేషనల్​, స్విస్​ ఓపెన్​ ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్​ ఓపెన్​ విజేతగా నిలిచింది.

ఇదీ చూడండి : ప్రాక్టీస్‌కు వెళ్లలేకపోతున్నా.. భారత్​ మాకు చాలా సాయం చేసింది: లంక క్రికెటర్​ భావోద్వేగం

Last Updated : Jul 17, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.