Korea Open Sindhu: మరో టైటిల్ వేటలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దూసుకెళ్తోంది. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ను 21-10, 21-16తో చిత్తు చేసింది. వరుస సెట్లలో 44 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఈ షట్లర్‌పై సింధు 17వ సారి తన రికార్డును మెరుగుపర్చుకుంది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఇప్పటికే సెమీస్ చేరాడు. స్థానిక షట్లర్ సన్ వాన్ హోతో హోరాహోరీ పోరులో పైచేయి సాధించాడు. గంటకుపైగా సాగిన పోరాటంలో 21-12,18-21,21-12 తేడాతో ఓడించాడు. శ్రీకాంత్ తనపై మెరుగైన రికార్డున్న ఆటగాడిపై గెలవడం విశేషం. మొత్తం ఇరువురూ 11 ఆడగా.. శ్రీకాంత్ నాలుగింట్లోనే గెలిచాడు. చివరిగా తలపడ్డ 3 సార్లు ప్రత్యర్థిదే పైచేయి. ఇప్పుడు మాత్రం గెలుపు శ్రీకాంత్‌నే వరించింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. అదే ఫామ్‌ను కొరియా ఓపెన్‌లోనూ కొనసాగిస్తున్నాడు. మరోవైపు కొన్నినెలలుగా నిలకడగా ఆడుతున్న యువకెరటం లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
ఇవీ చూడండి: కోహ్లీలా అది చదవడం నేర్చుకోవాలి.. కెప్టెన్‌కు శాస్త్రి సూచన