ETV Bharat / sports

చిక్కుల్లో లక్ష్యసేన్.. వయసు విషయంలో మోసం చేశాడని ఫిర్యాదు - లక్ష్యసేన్ పై ఫోర్జరీ కేసు

ప్రముఖ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ లక్ష్యసేన్​పై బెంగళూరు పోలీస్​ స్టేషన్​లో ఓ కేసు నమోదైంది. అతడి తల్లిదండ్రులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 3, 2022, 5:46 PM IST

వయసు విషయంలో తప్పుడు సమాచారాన్ని అందించి ఎందరో క్రీడాకారులకు రావాల్సిన అవకాశాలను కాజేశాడంటూ ప్రముఖ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ లక్ష్యసేన్​పై బెంగళూరులోని ఓ పోలీస్​ స్టేషన్​లో చీటింగ్​ కేసు నమోదు అయ్యింది. సేన్​తో పాటు అతని తల్లిదండ్రులు ధీరేంద్ర కుమార్​, నిర్మలతో పాటు మాజీ కోచ్​ విమల్ కుమార్​ను కూడా నిందితులుగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.​ బెంగళూరుకు చెందిన గోవియప్ప నాగరాజ అనే బ్యాడ్మింటన్​ కోచ్​ చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది : ఉత్తరాఖండ్​కు చెందిన సేన్​ సోదరులు బెంగళూరులోని ప్రకాశ్​ పదుకొణె బ్యాడ్మింటన్​ అకాడమీలో విమల్​ కుమార్​ ఆధ్వర్యంలో శిక్షణ పొందేవారు. అయితే క్రీడల్లో పాల్గొనాలంటే వారిద్దరి వయసు తక్కువ ఉండాలని భావించిన కోచ్​ 2010లో లక్ష్యసేన్​ తల్లిదండ్రులతో కలిసి అతడి బర్త్​ సర్టిఫికేట్​ను ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో రాసుంది.

1998లో లక్ష్యసేన్ పుట్టాడు. బర్త్​ సర్టిఫికేట్​లో నమోదైన తేదీ ప్రకారం ప్రస్తుతం అతడి​ వయసు 24ఏళ్లుగా ఉండాలి. కానీ బ్యాడ్మింటన్​ అసోసియేషన్​లో నమోదైన వివరాల ప్రకారం అతడి వయసు 21. అంటే లెక్క ప్రకారం మూడేళ్లు తగ్గింది. ఇదే ప్రకారం అతడి సోదరుడు చిరాగ్ వయసును​ కూడా రెండేళ్లు తక్కువ చేసి రాశారని ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇన్​స్టాలో ఈ మహిళా క్రికెటర్స్​కు​ క్రేజ్​ మామూలుగా లేదుగా

బంగ్లాదేశ్​తో సిరీస్​.. టీమ్​ఇండియాకు భారీ షాక్​.. సీనియర్​ పేసర్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.