Olympic Gold medallist Ban Imrankhan: ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై అసభ్యపదజాలంతో విమర్శలు చేశాడనే కారణంతో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రషీద్ ఉల్ హసన్‌పై పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్) పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ నిషేధంపై రషీద్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై తాను అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు.
ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా రషీద్ అనుచిత పదజాలం ఉపయోగించాడో లేదో తెలుసుకోవడానికి పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ విచారణ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కమిటీ ఇచ్చిన రెండు నోటీసులకు రషీద్ స్పందించకపోవడం వల్ల పీహెచ్‌ఎఫ్ అధ్యక్షుడి సూచనల మేరకు పదేళ్లపాటు నిషేధం విధించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను జాతీయ క్రీడల స్టాండింగ్ కమిటీకి అందించారు. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ హాకీ జట్టు బంగారు పతకం సాధించిన జట్టులో రషీద్ సభ్యుడు.
"సామాజిక మాధ్యమాలు లేదా ఇతర ప్రసార మాధ్యమాలలో ఎల్లప్పుడూ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తగిన గౌరవం ఇస్తూ మాట్లాడతాను. దేశంలో హాకీ క్రీడను ప్రోత్సాహిస్తామని ఇమ్రాన్‌ఖాన్ చెబుతూనే ఉన్నారు. గత మూడేళ్లలో హాకీని పట్టించుకోలేదు. దీనిపై ఒక వాట్సాప్ గ్రూప్‌లో మాట్లాడాను. ఆయన హాకీని ప్రోత్సహించే చర్యలు చేపట్టడు అని కూడా చెప్పాను. నేను ఇమ్రాన్ ఖాన్‌పై ఎటువంటి అభ్యంతకర పదజాలాన్ని ఉపయోగించలేదుఠ అని రషీద్ స్పష్టం చేశాడు. మరోవైపు, రషీద్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి తదుపరి చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ, ఇతర సంబంధిత సంస్థలకు లేఖలు జారీ చేయాలని పీహెచ్‌ఎఫ్.. పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్‌ను కోరింది.
ఇదీ చూడండి: Under-19 world cup: ఐదోసారి కప్పుపై కన్నేసిన భారత్