ETV Bharat / sports

FIFA Friendly Match 2023 : రెండు నిమిషాల్లో గోల్.. షాక్‌లో మెస్సీ ఫ్యాన్స్! - ఆస్ట్రేలియా వర్సెస్​ అర్జంటీనా

International Friendly Match 2023 : అర్జెంటీనా కెప్టెన్‌, స్టార్ ఫుట్​బాలర్​ లియోన‌ల్ మెస్సీ ఇటీవలే జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్​లో ఓ అరుదైన ఘనత సాధించి స్టేడియంలో ఉన్న అభిమానులను షాక్​కు గురి చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే ?

FIFA Friendly Match 2023
messi goal
author img

By

Published : Jun 16, 2023, 10:51 AM IST

Argentina vs Australia : అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉన్నాడు. 2022లో ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్​లో చెలరేగిన ఈ స్టార్ ప్లేయర్​.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి రెట్టింపు ఉత్సాహంలో ఉన్న మెస్సీ ఇప్పుడు తన ఆట తీరులో మరింత వేగం పెంచాడు. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్​లో తన సత్తా చాటి అందరిని అబ్బురపరిచాడు.

Messi International Goals : చైనా బీజింగ్​ వేదికగా గురువారం అర్జెంటీనా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్​లో మెస్సీ ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్‌ గోల్‌ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే అర్జెంటీనాకు ఓ గోల్​ను అందించిన మెస్సీ స్టేడియంలో ఉన్న అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక మెస్సీ కెరీర్‌లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్‌ గోల్​గా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో సెన్సేషన్​ సృష్టిస్తోంది. దీన్ని చూసిన అభిమనులు ఆనందం అంతా ఇంతా కాదు. 'మెస్సీ సూపర్​ స్టార్'​, 'అప్పటికీ ఇప్పటికీ మెస్సీలో ఏం మార్పులేదని' నెట్టింట అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడవ గోల్‌. ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది ఆడిన 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్‌ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ హోరా హోరీ పోరులో 2-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్‌ ప్రారంభంలో మెస్సీ ఇచ్చిన గోల్​ మ్యాచ్​కు ప్లస్​ పాయింట్​ కాగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్‌ పెజెల్లా రెండో గోల్‌ అందించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మెస్సీని చూసేందుకు స్టేడియానికి భారీ సంఖ్య‌లోఅభిమానులు తరలివచ్చారు. అందరూ మెస్సీ జెర్సీలు ధ‌రించి కనిపించగా.. మ‌రికొంద‌రు అర్జెంటీనా జెండాలు ప‌ట్టుకొని జట్టుకు మ‌ద్ద‌తు తెలిపారు.

Messi American Team : ఇటీవలే అర్జెంటీనా కెప్టెన్ పీఎస్‌జీ క్ల‌బ్‌ను వీడిన మెస్సీ.. వ‌చ్చే సీజ‌న్‌లో అత‌ను అమెరికాకు చెందిన ఇంట‌ర్ మియామి క్ల‌బ్‌ తరఫున ఆడ‌నున్నాడుత‌న వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ క‌ల‌ను నిజం చేసుకున్న మెస్సీ.. గతేడాది జరిగిన టోర్నీలో రెండోసారి అర్జెంటీనాను ఫైన‌ల్ చేర్చి ఫ్రాన్స్‌పై అద‌ర‌గొట్టాడు. రెండు గోల్స్ కొట్టి టీమ్ స్కోర్​ పెంచిన మెస్సీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ షూటౌట్‌లో మెస్సీ బృందం 4-2తో ఫ్రాన్స్‌పై గెలిచి విశ్వ విజేత‌గా అవ‌త‌రించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.