ETV Bharat / sports

'చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్​కు అదే అతిపెద్ద బలం'

author img

By

Published : Jul 27, 2022, 12:11 PM IST

చెస్‌ ఒలింపియాడ్​లో భారత్​ జట్ల విజయావకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగమ్మాయి, భారత-ఎ జట్టుకు సారథ్యం వహిస్తున్న హంపి. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆమె ఆడబోతున్న మెగా టోర్నీ ఇదే. ఈ క్రమంలో భారత్​లో ఒలింపియాడ్​ జరగడంపై ఆమె ఏం అన్నారు? భారత్​ బలాబలాలు ఎంటి?

koneru humpy
'చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్​కు అదే అతిపెద్ద బలం'

చెస్‌ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించేందుకు భారత జట్లకు మంచి అవకాశాలు ఉన్నాయంటోంది గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి. ఒకటి నుంచి నాలుగో బోర్డు వరకు నాణ్యమైన క్రీడాకారిణులు ఉండటం అతి పెద్ద సానుకూలాంశమని భారత-ఎ జట్టుకు సారథ్యం వహిస్తున్న హంపి పేర్కొంది. మహిళల కంటే బలంగా ఉన్న పురుషుల జట్టు మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమంటున్న హంపి.. చెస్‌ ఒలింపియాడ్‌ గురించి చెప్తున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

శక్తిని కూడగట్టుకోవాలి..

సుదీర్ఘ విరామం తర్వాత క్లాసికల్‌ టోర్నీ ఆడబోతున్నా. చివరిసారి 2020 ఫిబ్రవరిలో అమెరికాలో ఒక టోర్నీలో గెలిచా. కరోనా కారణంగా ఏడాది పాటు క్లాసికల్‌ టోర్నీలే జరగలేదు. కొన్ని ప్రయాణ సమస్యల వల్ల ఐరోపా పర్యటనకు వెళ్లకపోవడంతో టోర్నీలు ఆడలేకపోయా. నిరుడు డిసెంబరులో పోలెండ్‌లో ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీలో బరిలో దిగా. ఆన్‌లైన్‌లో మాత్రం తరుచూ ఆడుతున్నా. గత నెలలో మహిళల స్పీడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. ప్రతి 2, 3 నెలలకో ఈవెంట్‌లో ఆడుతున్నా. చెస్‌ ఒలింపియాడ్‌ క్లాసికల్‌ టోర్నీ. 11 రౌండ్లు ఉంటాయి. ఒక్కో గేమ్‌ 6 గంటలకు పైగా సాగుతుంది. చివరి వరకు శక్తిని కూడగట్టుకోవాలి. మన వరకు ఆడి వచ్చేయడానికి మిగతా టోర్నీలా కాదు. జట్టులోని మిగతా క్రీడాకారుల గేమ్‌ను పరిశీలించాలి. మళ్లీ కొత్త ప్రణాళికలు రచించుకోవాలి. ఎవరిని ఎక్కడ ఆడించాలి.. ఎవరిని పక్కన పెట్టాలి అన్నది ఆలోచించుకోవాలి.

పటిష్టంగా భారత్‌..

నా వరకు ఓపెనింగ్‌, మిడిల్‌ గేమ్‌పై ఎక్కువగా కసరత్తులు చేశా. ఈసారి ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. టాప్‌ బోర్డులో నేను, రెండో బోర్డులో హారిక, మూడో బోర్డులో వైశాలి, నాలుగో బోర్డులో తానియా బరిలో ఉన్నాం. భక్తి రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉంది. ఒలింపియాడ్‌లో టాప్‌ సీడ్‌గా బరిలో దిగుతుండటం ఇదే ప్రథమం. రష్యా, చైనా ఉండుంటే భారత్‌ మూడో సీడ్‌గా ఉండేది. చైనా ఎందుకు ఆడట్లేదో తెలియదు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై ఫిడె నిషేధం విధించింది. రష్యా, చైనాలు లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప ప్రదర్శన ఇవ్వొచ్చు. టోర్నీ ఆరంభమయ్యాక ప్రదర్శనపై అంచనా వస్తుంది. 4, 5 రౌండ్ల తర్వాత గట్టి జట్లు ఎదురవుతాయని అనుకుంటున్నా. అప్పుడు ఎలా ఆడతామన్నదే ముఖ్యం.

ఎవరి గేమ్‌ వారిదే..

చెస్‌ ఒలింపియాడ్‌ భారత్‌లో జరుగుతుండటాన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. సొంతగడ్డపై అనుకూల పరిస్థితుల మధ్య ఆడొచ్చు. ఆహారం, వసతులు అన్నీ బాగుంటాయి. ఏది కావాలన్నా చెస్‌ సమాఖ్య సమకూరుస్తుంది. అదే సమయంలో అంచనాల ఒత్తిడి కూడా ఉంటుంది. మీడియా దృష్టి ఎక్కువ ఉంటుంది. వీటిని సమన్వయం చేసుకుంటూ ఆడటం ప్రతి ఒక్క క్రీడాకారిణికి అత్యంత కీలకం. చెస్‌లో ఎవరి గేమ్‌ వాళ్లదే. బోర్డు బయట సమన్వయం కావాలి. టీమ్‌ ఈవెంట్లో ఒక్కోసారి ఒత్తిడిగా లోనవుతారు. సుదీర్ఘంగా చర్చలు సాగుతాయి. ఎవరితో ఎలా ఆడాలో సుదీర్ఘంగా మాట్లాడుకుంటారు. అక్కడే శక్తి మొత్తం అయిపోతుంది. అలాంటి విషయాలపై ఎక్కువ దృష్టిసారించాల్సిన అవసరం లేదు.

గెల్ఫాండ్‌ మార్గనిర్దేశం..

మే నెలలో చెన్నైలో మొదటి శిబిరానికి వెళ్లా. బోరిస్‌ గెల్ఫాండ్‌ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆనంద్‌ ప్రత్యర్థిగా గెల్ఫాండ్‌ ఆడాడు. గెల్ఫాండ్‌ తన అనుభవాన్ని మాతో పంచుకున్నాడు. విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ చక్కగా మార్గనిర్దేశం చేశాడు. ఎక్కువగా మిడిల్‌, ఎండ్‌ గేమ్‌లపై తర్ఫీదు ఇచ్చాడు. వ్యూహాలు రచించడం.. ఆలోచన విధానం ఎలా ఉండాలన్న దానిపై మార్గనిర్దేశనం చేశాడు. ఆన్‌లైన్‌ టోర్నీలు ఉండటం వల్ల రెండో శిబిరానికి వెళ్లలేదు. భారత కోచ్‌ల ఆధ్వర్యంలో ఆ శిబిరం జరిగింది.

ఎంతో తేడా..

కరోనా కారణంగా గత రెండు పర్యాయాలు ఆన్‌లైన్‌లో టోర్నీ జరిగింది. దాంతో పోలిస్తే ఇప్పుడు మానసికంగా, వ్యూహాత్మకంగా, సన్నాహాల పరంగా తేడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో ఆడాం. పురుషులు 2, మహిళలు 2, జూనియర్‌ బాలురు, జూనియర్‌ బాలికల.. మొత్తం ఆరు బోర్డు కలిసి ఒకే జట్టుగా ఆడాం. మళ్లీ ఇప్పుడు పాత పద్ధతికే వచ్చేశాం. పురుషులు, మహిళలకు విడివిడిగా ఛాంపియన్‌షిప్‌ ఉంటుంది. ఒక్కో గేమ్‌లో 4 బోర్డులు ఉంటాయి. గతంలో చాలాసార్లు 3, 4 బోర్డుల్ని ప్రత్యర్థులు లక్ష్యాలుగా చేసుకునేవాళ్లు. ఇప్పుడు మూడో బోర్డులో చాలా బలంగా తయారయ్యాం. వైశాలి బాగా ఆడుతుండటం పెద్ద సానుకూలాంశం. ఆన్‌లైన్‌లో జరిగిన గత రెండు ఒలింపియాడ్‌లలో భారత్‌కు పతకాలు వచ్చాయి. ఈసారి మంచి అవకాశం ఉంది. పతకం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. ఉక్రెయిన్‌, అమెరికా, పోలెండ్‌, జార్జియా జట్లు బలంగా ఉన్నాయి. రష్యా మాదిరే జార్జియా మహిళల జట్టు పటిష్టంగా ఉంది. వాళ్ల జట్టు సమన్వయం, శిక్షణ బాగుంటుంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందే ఆ దేశ క్రీడాకారులు వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. అక్కడి నుంచే ఆడుతున్నారు. వారి మానసిక స్థితి ఎలా ఉందో మనం చెప్పలేం.

మాకంటే బలంగా..

భారత పురుషుల జట్లు పటిష్టంగా ఉన్నాయి. చాలామంది క్రీడాకారులు 17, 18 ఏళ్లవారే. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. తెలంగాణ కుర్రాడు అర్జున్‌ బాగా ఆడుతున్నాడు. ఏడాదిన్నరగా చాలా మెరుగయ్యాడు. హరికృష్ణ, విదిత్‌ కూడా బాగా ఆడుతున్నారు. శిక్షణ శిబిరం సమయంలో వాళ్లు రాత్రి 2, 3 వరకు పని చేసుకునేవాళ్లు. రెండు జట్లను పోల్చి చూస్తే మహిళల కంటే పురుషుల జట్టే పటిష్టంగా ఉంది. వాళ్లకు పతకావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మంచి ప్రదర్శ నకు అదృష్టం కూడా కలిసొస్తే తిరుగుండదు.

ఇదీ చదవండి: వెస్టిండీస్‌తో చివరి వన్డే.. క్లీన్‌స్వీప్​పై ​ కన్నేసిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.