53వ బీల్ చెస్ ఫెస్టివల్ 2020లో భాగంగా జరిగిన అక్సెంటస్ చెస్960 టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ పి.హరికృష్ణ విజేతగా నిలిచాడు. జరిగిన ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు నమోదు చేసి తొలిస్థానంలో ఉన్నాడు. చివరి రౌండ్లో పొలాండ్కు చెందిన రాడోస్లా వోజ్టాస్జెక్ ఓడిపోవడం హరికి కలిసొచ్చింది.
కరోనావ్యాప్తికి నియంత్రణగాతొలి మూడు స్థానాల్లో
ఫిషర్ రాండమ్ చెస్గా ప్రాచుర్యం పొందిన చెస్960 టోర్నీలో జర్మన్ విన్సెంట్ కీమర్ ఐదు పాయింట్లతో హరికృష్ణ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 4.5 పాయింట్లు నమోదు చేసిన వోజ్టాస్జెక్ మూడోస్థానానికి పరిమితమయ్యాడు. ఈ టోర్నీలో యూఏఈ గ్రాండ్ మాస్టర్ సేలం సలేహ్ కరోనా ప్రయాణ ఆంక్షల వల్ల పాల్గొనలేకపోయాడు. అతడికి బదులుగా గ్రాండ్ మాస్టర్ అర్కాదీజ్ నైదిట్ష్ టోర్నీలో పాల్గొన్నాడు.
ఈ టోర్నీ క్లాసికల్ ఈవెంట్ జులై 21న అంటే సోమవారం ఒక్కరోజు విరామం తర్వాత జరగనుంది. కరోనా వ్యాప్తి నియంత్రణగా టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. ఆటగాళ్ల మధ్య రెండు టేబుల్స్ ఉంచడం సహా ప్రతి ఆట ముగిసిన తర్వాత అన్ని చెస్ ముక్కలను, చెస్ టైమర్లను శుభ్ర పరుస్తున్నారు. టోర్నీకి ప్రేక్షకులను అనుమతించడం లేదు.