ఆస్ట్రేలియాన్ కార్ రేసర్ రెనీ గ్రేస్.. తనకెంతో ఇష్టమై రేసింగ్‌ను విడిచిపెట్టి కొన్నేళ్ల క్రితం పోర్న్‌స్టార్‌గా మారింది. 'ఓన్లీఫ్యాన్స్' వెబ్‌సైట్‌లోని పలు చిత్రాల్లో నటిస్తూ వారానికి రూ.18.8 లక్షలు గడిస్తోంది. అయితే తాను రేసింగ్ కెరీర్‌ను వదిలి పోర్న్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"రేసింగ్‌లో నేను సరైన ఫలితాలు సాధించలేకపోయాను. తద్వారా ఫండ్స్ తీసుకురాలేకపోయాను. నా వంతు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడం వల్ల నా కెరీర్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే పోర్న్ స్టార్‌గా మారడం నా జీవితంలో జరిగిన మంచి విషయం. అది నాకు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. ఇలా జరుగుతుందని అనుకోనప్పటికీ, ఈ పనిని ఆస్వాదిస్తున్నాను. నా దగ్గరున్న ఫొటోలు, వీడియోలు అమ్మి.. 30 ఏళ్ల ఇంటి లోన్‌ను కేవలం 12 నెలల్లో తీర్చబోతున్నాను. పోర్న్ గురించి నా కుటుంబానికి తెలుసు. ఈ విషయంలో మా నాన్న నాకు అండగా నిలిచాడు" -రెనీ గ్రేస్, మాజీ రేసర్
1998 తర్వాత సూపర్కార్స్కు పనిచేసిన పూర్తిస్థాయి మహిళా రేసర్ రెనీ గ్రేస్. అయితే 2017లో ఆమెకు రేసింగ్ ఫలితాలు అంతగా లేకపోవడం, ఫండ్స్ రాకపోవడం వల్ల కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న కార్ యార్డ్‌లో పనిచేసిన రెనీ.. ఓన్లీఫ్యాన్స్ వెబ్సైట్ గురించి తెలుసుకుంది. అందులో తన న్యూడ్ ఫొటోలు, వీడియోలు అమ్మి.. తొలివారమే రూ.2.26 లక్షలు సంపాదించింది.