ETV Bharat / sports

జకోవిచ్​ ఖాతాలో మరో వింబుల్డన్​.. 21వ గ్రాండ్​స్లామ్​ కైవసం - Wimbledon champion Djokovic

Wimbledon champion Djokovic
Wimbledon champion Djokovic
author img

By

Published : Jul 10, 2022, 9:44 PM IST

Updated : Jul 10, 2022, 10:05 PM IST

21:43 July 10

జకోవిచ్​ ఖాతాలో మరో వింబుల్డన్​.. 21వ గ్రాండ్​స్లామ్​ కైవసం

Djokovic Wimbledon: అత్యంత ఉత్కంఠగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్​ ఫైనల్​లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. తొలిసారి గ్రాండ్​స్లామ్ ఫైనల్​​ ఆడిన కిర్గియోస్​.. ప్రపంచ నెం.1​ జకోవిచ్​ చేతిలో 4-6,6-3,6-4,7-6(7-3) తేడాతో తేలిపోయాడు. మొదటి సెట్​లో ఓడిన జకోవిచ్​.. రెండు, మూడు సెట్లలో గెలుపొందాడు. నాలుగో సెట్​ హోరాహోరీగా సాగి టై అయింది. టై బ్రేకర్​లో జకోవిచ్​ గెలిచి.. ఏడో వింబుల్డన్​ టైటిల్​ను కైవసం చేసుకున్నాడు.

ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో ఉన్న జకోవిచ్​.. మరో టైటిల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తన గ్రాండ్​స్లామ్​ టైటిళ్ల సంఖ్య 21కి చేరింది. అత్యధిక విజయాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫెదరర్​ను​ వెనక్కినెట్టాడు. రఫెల్​ నాదల్‌ 22 టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2018,2019,2021,2022లో వరుసగా నాలుగు వింబుల్డన్​ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు జకోవిచ్​.

Last Updated : Jul 10, 2022, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.