Nikhat Zareen World Boxing Championship final: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ వేదికపై తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖాయం చేసిన ఈమె.. ఈ టోర్నీలో మరో అడుగు ముందుకేసింది. ఇస్తాంబుల్ వేదికగా బుధవారం జరిగిన పోటీల్లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 52కేజీల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డి అల్మిడాను(Caroline De Almeda) 5-0తేడాతో ఓడించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి: థాయ్‌లాండ్ ఓపెన్‌లో శ్రీకాంత్ శుభారంభం.. రెండో రౌండ్‌కు అర్హత