ATP Rankings: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత రోజర్ ఫెదరర్.. ఏటీపీ ర్యాంకింగ్స్ పురుషుల సింగిల్స్‌లో 21ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాడు. 2001 జనవరిలో 19 ఏళ్ల వయసులో అతడు అందుకున్న ర్యాంక్‌కు చేరుకున్నాడు. అప్పటికి అతడు మొదటి టూర్ టైటిల్ కూడా గెలవకపోవడం గమానార్హం.
ఏటీపీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల ఫెదరర్ 13 స్థానాలు దిగజారి.. 1,665 పాయింట్లతో 30వ స్థానానికి పరిమితమయ్యాడు. మోకాలి శస్త్రచికిత్స కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జరగనున్న వింబుల్డన్‌కూ ఫెదరర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్న నొవాక్ జకోవిచ్.. 358వ వారంలోకి ప్రవేశించాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: Australian Open: నాదల్కు ప్రైజ్‌మనీ ఎంతంటే?