ETV Bharat / sports

చెల్లిని కాపాడిన అన్న.. ప్రపంచ బాక్సింగ్​ ఛాంప్​గా ఘనత - బ్రిడ్జ్​ వాకర్​ వార్తలు

ఒక్కోసారి మనం చూపించే తెగువ ఎందరికో ఆదర్శంగా మారడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. అందుకే మనదేశంలోనూ చిన్నారుల ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాలు మెచ్చి సాహస బాలుడు/బాలిక అంటూ అవార్డులతో సత్కరిస్తుంది ప్రభుత్వం. అయితే అమెరికాకు చెందిన 6 ఏళ్ల బాలుడు తన ధీరత్వంతో ఏకంగా ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​గా అవతరించాడు. ఎలాగో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

walker 6 year kid
చెల్లిని రక్షించిన 6 ఏళ్ల అన్న.. ప్రపంచ బాక్సింగ్​ ఛాంప్​గా ఘనత
author img

By

Published : Jul 16, 2020, 7:17 PM IST

బ్రిడ్జ​ర్ వాకర్​.. అమెరికాలోని వ్యోమింగ్​కు చెందిన ఆరేళ్ల ఈ బుడతడు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్​గా మారాడు. ఇతడు చేసిన ఓ సాహస పనిని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇంటి సమీపంలో తన చెల్లితో కలిసి వాకర్​ ఆడుకుంటుండగా.. ఓ కుక్క వాళ్ల మీదకు దూకింది. అసలే చిన్నదైన తన చెల్లిని ఏమి చేయకుండా ఓ యోధుడిలా దానికి అడ్డుగోడగా నిలబడ్డాడు. చాలా సేపు కుక్కతో పోరాడాడు. ఆ ఘర్షణలో తన ముఖం చిట్లి రక్తం కారినా విడిచిపెట్టలేదు. ఆఖరుకు శబ్దాలు విని తల్లిదండ్రులు రాగా.. అప్పటికే ముఖం నిండా రక్తం కారుతూ ఉంది. తన ప్రియమైన చెల్లెలిని కుక్కల బారి నుంచి కాపాడుకునేందుకు ఎంతగా పోరాటం చేశాడంటే.. తన ప్రాణాలనే పణంగా పెట్టినంత పనిచేశాడు. ఆ దాడిలో చిన్నోడికి ఏకంగా 90 కుట్లు పడ్డాయి. ఆపరేషన్​ చేసేందుకే డాక్టర్లు రెండు గంటలు శ్రమించారట.

  • We are honored to name 6-year-old, Bridger Walker, WBC Honorary Champion, for his brave actions that represent the best values ​​of humanity. Bridger, you're a hero 👏🔰 pic.twitter.com/L2FqL0K4vw

    — World Boxing Council (@WBCBoxing) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ విషయాన్ని తన అత్త సోషల్​ మీడియాలో పెట్టగా.. విపరీతంగా వైరల్​ అయింది. బాలుడి పోరాట పటిమను అందరూ ప్రశంసించారు. విషయం తెలుసుకున్న ప్రపంచ బాక్సింగ్​ కౌన్సిల్​(డబ్ల్యూబీసీ) బుడతడిని ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​(గౌరవార్థం)గా ప్రకటించింది. బ్రిడ్జర్​కు అవార్డు ఇవ్వడాన్ని హెవీవెయిట్​ ఛాంపియన్​ టైసన్​ ఫ్యూరీ వంటి ఎందరో స్వాగతించారు. మెచ్చుకుంటూనే చిన్నవయసులోనే వాకర్​ మానవత్వాన్ని కొనియాడారు.

కమిలిపోయిన ముఖంతో ఉన్న బ్రిడ్జర్​ ఫొటోకు మిలియన్ల లైక్​లు, లక్షల మంది కామెంట్లు పెట్టారు. అదే ఫొటోను తన అధికారిక ట్విట్టర్​లో షేర్​ చేసింది డబ్ల్యూబీసీ.

అదిరిపోయే సమాధానం..

కుక్క దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు పారిపోలేదని తండ్రి.. బ్రిడ్జర్​ను ప్రశ్నించగా.. హృదయానికి హత్తుకునే సమాధానం ఇచ్చాడట. "కుక్క చేతిలో ఎవరైనా చావాల్సి వస్తే.. అది నేను మాత్రమే అయి ఉండాలి అనుకున్నా" అని రిప్లై ఇచ్చేసరికి తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడట.

ఇప్పటికే బుడ్డోడి ధైర్య సాహసాలు హాలీవుడ్​ నటీనటులు కూడా మెచ్చుకున్నారు. నిజమైన హీరోగా పోల్చుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.