క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరున్న యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. రిటైర్మెంట్ అనంతరం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నాడు. ఇటీవలే దుబాయ్‌లోని (Yuvraj Singh Dubai) ఫేమ్ పార్క్‌ను సందర్శించిన యువీ.. అక్కడ ఓ లైగర్‌లో పోటీ పడ్డాడు. స్నేహితులతో కలిసి దానితో టగ్ ఆఫ్ వార్ చేశాడు. కానీ లైగర్ ముందు నిలవలేకపోయింది యువీ బృందం. టూర్‌కు సంబంధించిన విశేషాలను ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు యువరాజ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"టైగర్ వర్సెస్ లైగర్.. తుది ఫలితం మీకు అందరికీ తెలుసు (నవ్వుతూ). భయాలన్నీ పక్కనపెట్టి అడవి అసలు స్వభావాన్ని అనుభూతి చెందాను. గొప్ప అనుభవం పొందాను."
- యువరాజ్ సింగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఆ తర్వాత పార్క్ మొత్తం సరదాగా కలియతిరిగాడు యువీ (Yuvraj Singh News). ఓ భారీ పామును తను భయపడుతూనే మెడలో వేసుకున్నాడు. ఎలుగుబంటి, కోతి, ఇతర అడవి జంతువులకు ఆహారం తినిపించాడు. యువీ చేసిన సందడి సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
2019 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు యువరాజ్ (Yuvraj Singh Retirement). టీమ్ఇండియా.. 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చూడండి: ధోనీ 'కింగ్ కాంగ్' లాంటోడు: రవిశాస్త్రి