ETV Bharat / sports

రంజీ ట్రోఫీలో యష్​ ధుల్​.. ఏ జట్టుకు ఆడనున్నాడంటే? - రంజీ ట్రోఫీ దిల్లీ జట్టు

Yash Dhull Ranzi Trophy: అండర్​-19 ప్రపంచకప్​ విజయంతో జోష్​ మీదున్న కెప్టెన్​ యష్​ ధుల్​ రంజీ ట్రోఫీ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇంతకీ అతడు ఏ జట్టుకు ఆడబోతున్నాడంటే...

Yash Dhull Ranzi Trophy Delhi team
రంజీ ట్రోఫీలో యష్​ ధుల్
author img

By

Published : Feb 10, 2022, 3:28 PM IST

Yash Dhull Ranzi Trophy: అండర్​-19 ప్రపంచకప్​ను భారత్​కు అందించిన కెప్టెన్​ యష్​ ధుల్​ రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతడు దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. తాజాగా దిల్లీ టీమ్​ తమ జట్టు కోసం ఎంపిక చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. వీరిలో యష్​ పేరు ఉంది. ఈ జట్టుకు ప్రదీప్​ సంగ్వాన్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

యష్​.. ఫిబ్రవరి 10న గౌహతికి చేరుకుంటాడు. అక్కడే 5రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనున్నాడు. అనంతరం జట్టుతో కలవనున్నాడు. కాగా, ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న​ఇషాంత్​ శర్మ.. ఈ సీజన్​ నుంచి తప్పుకున్నాడు.

"యష్​కు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అతడు ఎర్ర బంతి మ్యాచులు ఎక్కువగా ఆడనప్పటికీ ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాం" అని ఓ డీడీసీఏ సెలక్టర్​ అన్నారు.

ప్రస్తుతం యష్​తో పాటు అండర్​-19 ప్రపంచకప్​ విజేత జట్టు మొత్తం అహ్మాదాబాద్​లో ఉంది. వీరందరూ టీమ్​ఇండియా-వెస్టిండీస్​ మధ్య జరిగిన రెండో వన్డేకు అతిథులుగా హాజరై మ్యాచ్​ను వీక్షించారు.

జట్టు: ప్రదీప్​ సంగ్వాన్​(కెప్టెన్​), నితీశ్​ రానా, ధ్రువ్​ సోరె, ప్రియాంశ్​ ఆర్య, యశ్​ ధుల్​, సితిజ్(Khsitij)​ శర్మ, జాంటీ సిధు, హిమ్మత్​ సింగ్​, లలిత్​ యాదవ్​, అనుజ్​ రావత్​, లక్షయ్​ థరేజా, నవదీప్​ సైనీ, సిమర్జిత్​ సింగ్​, మయాంక్​ యాదవ్​, కుల్దీప్​ యాదవ్​, వికాస్​ మిశ్రా, శివాంగ్​ వశిష్ట్​, శివమ్​ శర్మ

ఇదీ చూడండి: Team India U19: కొత్తగా '19 ప్లస్​' టీమ్​.. బీసీసీఐ యోచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.