WTC Final 2023 IND VS AUS : ఆస్ట్రేలియా జట్టును చూస్తుంటే టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష తప్పదనిపించేలా ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు వార్నర్, ఖవాజా, స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రేవిస్ హెడ్, స్టార్క్, అలెక్స్ కేరీ, బోలాండ్, లైయన్,.. ఇలా జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ డబ్ల్యూటీసీ జరిగే ఫైనల్ వేదిక ఓవల్ కావడం వల్ల.. పేస్ దాడితో కంగారూ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎడిషన్‌లో(2021లో).. ఇంగ్లాండ్(సౌథాంప్టన్) గడ్డపై న్యూజిలాండ్ పేస్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి ఆసీస్ పేస్ దళాన్ని ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
WTC Final 2023 Australia : మొత్తంగా ఈ డబ్ల్యూటీసీ సైకిల్(2021- 23) గమనిస్తే.. ఆస్ట్రేలియా మంచి జోరు మీద ఉంది. 19 మ్యాచుల్లో 11 విజయాలు, 5 డ్రాలతో పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్‌తో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన టాప్ 7 బ్యాటర్లలో నలుగురు ఆస్ట్రేలియా ప్లేయర్సే ఉన్నారు. అత్యధిక వికెట్లన తీసింది ఆసీస్ బౌలరే. కాబట్టి ఆసీస్ ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద కష్టమే అనేలా అనిపిస్తోంది.
-
Tune up in Beckenham ahead of the #WTCFinal 🔥
— cricket.com.au (@cricketcomau) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📷: @ICC / Getty #WTC23 pic.twitter.com/otyb7Qjgaa
">Tune up in Beckenham ahead of the #WTCFinal 🔥
— cricket.com.au (@cricketcomau) June 2, 2023
📷: @ICC / Getty #WTC23 pic.twitter.com/otyb7QjgaaTune up in Beckenham ahead of the #WTCFinal 🔥
— cricket.com.au (@cricketcomau) June 2, 2023
📷: @ICC / Getty #WTC23 pic.twitter.com/otyb7Qjgaa
బలంగా బ్యాటింగ్ ఆర్డర్..
WTC Final Australia batting : ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్‌లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
- ఓపెనర్ ఖవాజా ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో 69.91 యావరేజ్‌తో 1608 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్స్‌లో రూట్ (1915) తర్వాత అతడే ఉన్నాడు. చివరగా భారత్‌లో ఆడిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లోనూ 333 అత్యధిక పరుగులు చేసింది అతడే కావడం విశేషం.
- క్రీజులో కుదురుకుంటే చాలు సెంచరీలు బాదే లబుషేన్ కూడా ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. ఈ డబ్ల్యూటీసీ చక్రంలో అతడు 19 మ్యాచ్‌ల్లో 1509 పరుగులు సాధించాడు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, బౌలర్ల లయను దెబ్బతీయగలిగే నైపుణ్యం అతడి సొంతం.
- స్మిత్.. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 19 మ్యాచ్‌ల్లో 1252 పరుగులు చేశాడు. నిజానికి టీమ్‌ఇండియాతో మ్యాచ్ అనగానే.. రెచ్చిపోతుంటాడు స్మిత్. అతడు భారత్‌పై 18 టెస్టుల్లో 65.06 యావరేజ్‌తో 1887 రన్స్ చేశాడు. ఈ యావరేజ్ అతడి కెరీర్ సగటు (59.80) కన్నా ఎక్కువ. ఇంగ్లాండ్‌లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. 16 టెస్టుల్లో 1727 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఓవల్‌లోనూ గొప్పగానే ఉంది. అక్కడు 3 టెస్టుల్లో ఏకంగా 97.75 యావరేజ్‌తో 391 రన్స్ చేశాడు. స్మిత్‌ను కూడా క్రీజులో కాస్త కుదురుకుంటే చాలు.. చెలరేగిపోతాడు. మరో విషయమేమిటంటే.. స్మిత్, లబుషేన్ కౌంటీల్లో ఆడుతూ.. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బాగా సిద్ధమయ్యారు.
- ఇకపోతే మిడిలార్డర్‌లో హెడ్ కీలక ఆటగాడిగా మారాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 17 మ్యాచ్‌ల్లో 1208 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో, ఛేదనలో లక్ష్యాన్ని అందుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
అందరి కళ్లు అతడిపైనే....
- పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్.. ఫార్మాట్‌కు తగ్గట్లుగా బ్యాటింగ్‌లో పరుగులు చేయడం.. మంచి వేగంతో బౌలింగ్ చేయడం ఇతడి స్పెషాలిటీ. ఈ మధ్య అంతర్జాతీయ క్రికెట్లో ఇతడి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. బ్యాట్, బంతితో మంచి ప్రదర్శన చేస్తూ తక్కువ సమయంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇప్పటివరకూ 20 టెస్టులు ఆడి.. 941 పరుగులు, 23 వికెట్లూ తీశాడు. ఈ సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు.. ఓ సెంచరీతో పాటు 452 పరుగులతో రాణించాడు. అందుకే ఆసీస్ జట్టు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇతడిపైనా భారీ ఆశలు పెట్టుకుంది.
- ఇక ఫామ్‌లో లేక ఇబ్బంది వార్నర్ కూడా ఈ సీజన్ ఐపీఎల్‌తో కాస్త గాడిలో పడ్డాడు. అతను క్రీజులో కుదురుకుని నిలబడితే.. ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ఇంకా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ కూడా అవసరమైనప్పుడు జట్టుకు బాగానే ఉపయోగపడుతున్నాడు.
-
JUST IN: Michael Neser has replaced Josh Hazlewood in Australia's squad for the #WTC23 Final starting on Wednesday. pic.twitter.com/AcUHcEYK57
— cricket.com.au (@cricketcomau) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">JUST IN: Michael Neser has replaced Josh Hazlewood in Australia's squad for the #WTC23 Final starting on Wednesday. pic.twitter.com/AcUHcEYK57
— cricket.com.au (@cricketcomau) June 4, 2023JUST IN: Michael Neser has replaced Josh Hazlewood in Australia's squad for the #WTC23 Final starting on Wednesday. pic.twitter.com/AcUHcEYK57
— cricket.com.au (@cricketcomau) June 4, 2023
బౌలింగ్ దళం.. అదొక్కటే దెబ్బ..
WTC Final Australia Bowling : ప్రస్తుతం ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ అనే చర్చ రాగానే.. అందరూ ఆసీస్ బౌలింగ్ బలం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే గాయం వల్ల జట్టుకు హేజిల్‌వుడ్ దూరమవ్వడం ఆ జట్టుకు దెబ్బే అని చెప్పాలి. అయితే ఆసీస్‌కు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇతడి స్థానంలో వచ్చిన నెసర్ కూడా మంచి పేసరే.
- కమిన్స్- స్టార్క్.. ఈ పేస్ ద్వయంకు ఇంగ్లాండ్ పిచ్‌లపై మంచి రికార్డు ఉంది. ఎలాంటి ప్రత్యర్థికైనా వణుకు పుట్టిస్తుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమిన్స్ 15 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు పడగొడితే.. స్టార్క్ 16 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు.
- ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్‌లపై స్వింగ్ అనుకూల పరిస్థితుల్లో కెప్టెన్ కమిన్స్ ఎక్కవ ప్రభావవంతంగా రాణించగల సత్తా ఉంది. ఇంగ్లాండ్‌లో 5 టెస్టుల్లో 19.62 యావరేజ్‌తో 29 వికెట్లు తీశాడు. టీమ్‌ఇండియాపై 12 టెస్టుల్లో 46 వికెట్లు పడగొట్టాడు.
- స్టార్క్ ఓ డేంజరస్ బౌలరే. అతడు టార్గెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో మంచిగా రాణించడమే. అందుకే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టడం కోసం.. వరల్డ్ వైడ్‌గా ఉన్న లీగ్‌లకు దూరంగా ఉంటున్నాడు. వేగమే అతడి ఆయుధం. మంచి పేస్‌తో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. పాత బంతితోనూ సమర్థవంతంగా రివర్స్ స్వింగ్ చేయగలతాడు.
- ఇక స్పిన్ విషయానికి వస్తే.. ఆ జట్టులో ఒక్క స్పిన్నర్‌నే ఆడించే ఛాన్స్ ఉంది. అతడే లైయన్. పిచ్ అనుకూలిస్తే చాలు.. ఈ ఆఫ్‌స్పిన్నర్ విజృంభిస్తాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 83 అత్యధిక వికెట్లు పడగొట్టింది అతడే. ఈ ఫైనల్ లాస్ట్ టు డేస్ గేమ్‌లో అతడు కీలకం కానున్నాడు. ఇంగ్లాండ్‌లో అతడు 13 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి : WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారంటే?
WTC Final : భారత్‌కు వీరు.. ఆసీస్‌కు వారు.. ఇరు జట్లలో ఎవరిదో పైచేయి?