ETV Bharat / sports

WPL 2023 : అదరగొట్టిన మాథ్యూస్​, బ్రంట్​.. ముంబయి ఇండియన్స్​ సూపర్ విక్టరీ - డబ్యూపీఎల్​ 2023

WPL 2023 : మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఘన విజయం సాధించింది ముంబయి ఇండియన్స్.

wpl mi vs rcb
wpl mi vs rcb
author img

By

Published : Mar 6, 2023, 10:32 PM IST

Updated : Mar 6, 2023, 10:54 PM IST

WPL 2023 : మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయి వేదికగా జరిగిన ఈ డబ్ల్యూపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ రెెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 156 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి జట్టుకు 5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. ముంబయి ఇండియన్స్​ బ్యాటర్లు హేలీ మాథ్యూస్(38 బంతుల్లో 77*)​, నాట్​ స్కీవర్​ బ్రంట్( 29 బంతుల్లో 55*)​ అర్థ శతకాలతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. జట్టు గెలవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. మరో ఓపెనర్​ యాస్తికా భాటియా(23) 19 బంతుల్లో 4 ఫోర్లతో ఫర్వాలేదనిపించింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23; 5×4) సోఫియే డివైన్‌ (16; 4×2) శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోవడం వల్ల స్కోర్​బోర్డ్ నత్తనడకన సాగింది. చివర్లో రిచా ఘోష్‌ (28), ఆహుజా (22), శ్రేయంకా పాటిల్‌ (23), మేఘనా స్కౌట్‌ (20) రాణించడం వల్ల ఆర్‌సీబీ ఆ స్కోర్ సాధించింది. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సాయిక్‌ ఇషాక్‌, అమేలియా కేర్‌ చెరో 2 వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్‌,బంట్ర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇవీ చదవండి : WPL 2023: దంచికొట్టిన కిరణ్​, గ్రేస్.. యూపీ బోణీ.. గుజరాత్​కు మళ్లీ నిరాశే

WPL 2023: నోరిస్​ 'పాంచ్​' పటాకా.. బెంగళూరుపై దిల్లీ ఘన విజయం

Last Updated : Mar 6, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.