World Cup Sensation Winners : 2023 ప్రపంచకప్‌లో అక్టోబర్ 15 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్.. డిఫెండింగ్ ఛాంప్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. పసికూన అఫ్గాన్.. ఇంగ్లాండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి ఔరా అనిపించింది. అయితే క్రికెట్లో కొన్నిసార్లు.. అసాధ్యం అనకున్నవి సుసాధ్యం అవుతాయి. అందుకు తాజాగా జరిగిన ఇంగ్లాండ్ - అఫ్గానిస్థాన్ మ్యాచే నిదర్శనం. ఈ మెగాటోర్నీలో ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు ఆయా ఎడిషన్ల వరల్డ్‌కప్‌లలో చిన్న చిన్న జట్లు.. మేటి జట్లపై నెగ్గాయి. అలా ఎవరెవరు ఎప్పుడు ఎవరిపై నెగ్గారో తెలుసుకుందాం.
- 1983లో చిన్న జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన భారత్.. పలు సంచలన విజయాలు నమోదుచేసింది. అప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు షాకిచ్చింది భారత్. ఆ ఎడిషన్‌లో గ్రూప్ స్టేజ్‌లో భారత్.. విండీస్‌తో రెండుసార్లు తలపడింది. దీంట్లో తొలి మ్యాచ్‌లో భారత్.. 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
- ఇక అదే ఎడిషన్ మొదటి సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొన్న భారత్.. 6 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్స్‌లో మళ్లీ విండీస్‌తో తలపడ్డ భారత్.. 43 పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
- అదే ప్రపంచకప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. క్రికెట్లో అప్పుడప్పుడే ఓనమాలు దిద్దుతున్న జింబాబ్వే.. బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆశ్చర్యానికి గురిచేసింది.
- 1992 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే మళ్లీ సంచలనం సృష్టించింది. ఈసారి ఇంగ్లాండ్‌పై నెగ్గింది.
- 1996 ప్రపంచకప్‌లో ఊహించని విజయం నమోదుచేసింది కెన్యా. ఈ పసికూన.. అప్పటికే రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన విండీస్ జట్టును చిత్తుచేసింది. ఇక ప్రపంచకప్ చరిత్రలో టెస్టు హోదా ఉన్న జట్టును నాన్ టెస్టు టీమ్ ఓడించడం ఇదే తొలిసారి.
- 1999 మెగాటోర్నీలో ఏకంగా రెండు జట్లు ఆశ్చర్యానికి గురిచేశాయి. అందులో జింబాబ్వే.. సౌతాఫ్రికా, టీమ్ఇండియాపై విజయాలు నమోదు చేయగా.. బంగ్లాదేశ్, పటిష్ఠమైన పాకిస్థాన్‌ను ఓడించింది.
- 2003 ఎడిషన్‌లో హేమాహేమీలతో కూడిన శ్రీలంకను.. కెన్యా మట్టికరిపించింది.
- 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్.. టీమ్ఇండియాకు షాకిచ్చింది. భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా.. మరో తొమ్మిది బంతులుండగానే ఛేదించింది.
- 2011లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో పసికూన ఐర్లాండ్, బలమైన ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. ఐర్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది.
- 2015లోనూ ఐర్లాండ్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ ఎడిషన్‌లో ఐర్లాండ్.. విండీస్‌ను చిత్తుచేసింది. ఇక బంగ్లాదేశ్.. ఇంగ్లాండ్‌పై నెగ్గింది.
-
A second CWC victory, eight years in the making 🇦🇫🫶
— ICC (@ICC) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
#CWC23 pic.twitter.com/MEdIRDOPv6
">A second CWC victory, eight years in the making 🇦🇫🫶
— ICC (@ICC) October 16, 2023
#CWC23 pic.twitter.com/MEdIRDOPv6A second CWC victory, eight years in the making 🇦🇫🫶
— ICC (@ICC) October 16, 2023
#CWC23 pic.twitter.com/MEdIRDOPv6
-
ODI World cup 2023 Rashid Khan : నాడు విలన్.. నేడు హీరో.. డిఫెండింగ్ ఛాంపియన్‌పై అదరగొట్టేశాడు!
ODI World Cup 2023 IND VS PAK : ఆ మజా మళ్లీ దొరకదా?.. భారత్ - పాక్ మ్యాచుల్లో కిక్ ఏది బాసూ!