World Cup 2023 Opening Ceremony : మరో మూడు రోజుల్లో 2023 ప్రపంచకప్‌నకు తెర లేవనుంది. అక్టోబర్ 5న ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. అయితే వరల్డ్ కప్ నేపథ్యంలో 'టోర్నమెంట్ ఓపెనింగ్ ఈవెంట్'ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్లాన్ చేస్తోంది. మరి ఈ ఈవెంట్ ఎక్కడ, ఎప్పుడు జరగనుంది? వేడుకకు ఎవరెవరు హాజరుకానున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం..
టోర్నీ ప్రారంభానికి ఒక్కరోజు ముందు అక్టోబర్ 4న ఈ ఈవెంట్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు అహ్మదాబాద్ నరేంద్రమోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికకానుంది. కళ్లుచెదిరే లేజర్ షో లైటింగ్ సెటప్, భారీ హోర్డింగ్‌లు, ఫైర్ వర్క్స్, అదిరిపోయే మ్యూజిక్ సిస్టమ్‌తో నరేంద్రమోదీ స్టేడియం ముస్తాబైంది. అయితే ఎప్పటిలాగే టోర్నీలో పాల్గొనే ఆయా జట్ల కెప్టెన్లు.. ఈ వేడుకలో పాల్గొంటారు. అలాగే బాలీవుడ్‌కు చెందిన కొంతమంది సినీతారలు, సింగర్స్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
బాలీవుడ్ నుంచి హాజరయ్యేది వీరే.. మెగాటోర్నీ గ్రాండ్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ తమన్నా భాటియా, దిగ్గజ గాయకురాలు ఆశా భోస్లే, సింగర్లు శ్రియా ఘోషల్, అర్జిత్ సింగ్ పాల్గొననున్నారు. వీరితో పాటు 2011, 2023 ప్రపంచకప్ సాంగ్ సింగర్స్ శంకర్ మహదేవన్, ప్రీతమ్ కూడా హాజరవ్వనున్నారు.
ఈవెంట్ ఎప్పుడు ప్రారంభం.. ఈ ఈవెంట్ అక్టోబర్ 4న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇక అక్టోబర్ 5న న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు టికెట్లు కొనుగోలు చేసినవారు ఈ వేడుకను స్టేడియంలో వీక్షించవచ్చు.
-
Great news 🥳🥳
— Baljeet Singh (@ImTheBaljeet) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Lighting work started at Narendra Modi Stadium, Ahmedabad roofs ahead of Cricket World Cup 2023 Opening Ceremony. pic.twitter.com/U120McjAHb
">Great news 🥳🥳
— Baljeet Singh (@ImTheBaljeet) October 1, 2023
Lighting work started at Narendra Modi Stadium, Ahmedabad roofs ahead of Cricket World Cup 2023 Opening Ceremony. pic.twitter.com/U120McjAHbGreat news 🥳🥳
— Baljeet Singh (@ImTheBaljeet) October 1, 2023
Lighting work started at Narendra Modi Stadium, Ahmedabad roofs ahead of Cricket World Cup 2023 Opening Ceremony. pic.twitter.com/U120McjAHb
World Cup 2023 Live Streaming : ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ టెలివిజన్ ఛానెల్లో, అలాగే లైవ్ స్ట్రీమింగ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఇక ఈ టోర్నమెంట్లో టీమ్ఇండియా అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు చెన్నై చిదంబరం స్టేడియం వేదికకానుంది.
ODI World Cup 2023 England Team : ఫేవరెట్‌గా డిఫెండింగ్ ఛాంపియన్.. అదొక్కటే మైనస్